Parmita Katkar: బెస్ట్‌గా తీర్చిదిద్దే..  బ్లష్‌ విత్‌ మి స్కూల్‌

6 Oct, 2021 08:31 IST|Sakshi

సోషల్‌ స్టార్‌

జీవితంలో బతకాలంటే ఉద్యోగం కావాలి. ఉద్యోగం కోసం అనేక రకాల అవగాహనను పెంచుకోవడం కోసం చాలా డబ్బులను వెచ్చిస్తాం. ఉద్యోగం వచ్చాక మనల్ని మరింత బెస్ట్‌గా నిరూపించుకోవడానికి ప్రయతి్నస్తాం. కానీ అది ఎలాగో తెలీదు. చాలామందికి ఎక్కడ ప్రారంభించాలి, వ్యక్తిగత స్టైల్‌ అంటే ఏంటీ? మనల్ని మనం చక్కగా ఎలా ప్రజెంట్‌ చేసుకోవాలి? ఆత్మధైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి? సామాజిక కార్యక్రమాల్లో ఎలా పాల్గొనాలి వంటి వాటి గురించి బొత్తిగా తెలీదు. దీనివల్ల కూడా కెరీర్‌లో వెనుకబడి పోతుంటారు. మిమ్మల్ని మీరు మరింత బాగా తీర్చిదిద్దుకోవాలంటే ‘‘బ్లష్‌ విత్‌ మి – పరి్మతా’’ స్కూల్‌ను ఫాలో అవ్వండి అని చెబుతోంది పర్మితా కట్కర్‌. నలభైఏళ్ల వయసులో తను ఫిట్‌గా ఉండడమేగా, గ్లామరస్‌ రోల్స్‌ పోషిస్తూ, చూపుతిప్పుకోని ర్యాంప్‌వాక్‌లు చేస్తూ, మరోపక్క ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా రాణిస్తూ వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. 

ఢిల్లీలో పుట్టిన పర్మితా కట్కర్‌..తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా బెంగళూరుకు మకాం మార్చడంతో ఆమె అక్కడే చదువుకుంటూ పెరిగింది. తొలుత మోడల్‌గా కెరియర్‌ ప్రారంభించింది కానీ తరువాత నటన వైపు ఆకర్షితురాలయ్యింది. ఒక పక్క మోడల్‌గా రాణిస్తూనే 2003లో మిస్‌ఇండియా పసిఫిక్‌ కిరీటాన్ని గెలుచుకుంది. దీంతో మోడలింగ్, యాక్టింగ్‌కు మంచి అవకాశాలు వచి్చ పడడంతో బాగా బిజీ అయ్యింది. కెరియర్‌ ప్రారంభంలోనే బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో కలిసి మోడలింగ్‌ చేసింది. ఈ క్రమంలోనే ఇండియాలో ప్రముఖ ఫోటోగ్రాఫర్స్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. దీంతో ఫోటోగ్రఫీ ఎలా చేస్తున్నారో బాగా గమనించేది. ఇదే ఏడాది ‘బాస్‌ యన్‌ హై’లో తారా పాత్రను పోషించింది. మనోజ్‌ బాజ్‌పేయితో కలిసి ఇంటెకామ్‌: ద పర్‌ఫెక్ట్‌ గేమ్, హూసన్‌–లవ్‌ అండ్‌ బెట్రియాల్, లవ్‌ కే చక్కర్‌ మెయిన్, కచ్చి సాదక్‌ సినిమాల్లో నటించింది. అంతేగాక మధు బండార్కర్‌ నిర్మించిన ‘పేజ్‌ 3’లో ఐటమ్‌ సాంగ్‌లో నటించింది. 

పెళ్లి... పిల్లలు... ఫోటోగ్రఫీ.. 
వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ 2008లో రవికురదాను పెళ్లి చేసుకుని న్యూయార్క్‌లో స్థిరపడింది. పరి్మతాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. తన కొడుకులిద్దరిని రకారకాల ఫొటోలను క్రియేటివ్‌గా తీసేది. ఆ ఫోటోలు చూసిన స్నేహితులు, ఇరుగుపొరుగు వారు ‘ఫోటోలు చాలా బావున్నాయి’ అని చెప్పి పరి్మతను వాళ్ల ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు ఫోటోలు తీయమనేవారు. దాంతో ఆమెకు తనలో దాగి ఉన్న ఫోటోగ్రఫీ కళకు మెరుగులు దిద్దుకోవాలనిపించింది. న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో ఫోటోగ్రఫీలో డిగ్రీ చేసింది. అదీ సాదాసీదాగా ఏం కాదు... క్లాస్‌ టాపర్‌గా నిలిచింది.


డిగ్రీ చదువుతోన్న సమయంలోనే నేషనల్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ బాబీ బ్రౌన్‌తో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. దీంతో బాబీ బ్రౌన్‌తో కలిసి న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌లో పనిచేసింది. అంతేగాక అనేక ఈవెంట్లకు కొరియోగ్రఫీ కూడా చేసింది. మిస్‌ ఇండియా అమెరికా, మిస్‌ ఇండియా న్యూయార్క్, మిస్‌ ఇండియా కనెక్టికట్‌ వంటి ఈవెంట్లకు పనిచేసి తన కళకు మరిన్ని మెరుగులు దిద్దుకుంది. నైపుణ్యం కలిగిన ఫోటోగ్రాఫర్స్‌తో కలిసి అనేక కార్యక్రమాల్లో పనిచేసింది. అంతేగాక నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌(ఎన్‌ఐఎఫ్‌డీ)కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా పనిచేసింది. వీటన్నింటితోపాటు ఫ్యాషన్‌ వరల్డ్‌లో విద్యార్థులు మరింత ఎదిగేలా ప్రేరణ అందించింది. ఇవేగాక ఎంటర్‌టెయిన్‌మెంట్, కామెడీ, సెలబ్రెటీ గాసిప్‌ వంటి ఎనిమిది రకాల టెలివిజన్‌ టాక్‌ షో లకు హోస్ట్‌గా వ్యవహరించింది. 

బ్లష్‌ విత్‌ మి.. 
ఫ్యాషన్, బ్యూటీపై ఉన్న అవగాహన, ఫోటోగ్రఫీపై పట్టుతో బ్లష్‌ విత్‌ మి–పరి్మతా పేరుతో 2014లో యూ ట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించింది, దీని ద్వారా మహిళాభివృద్ధి కోసం కృషిచేస్తున్నారు. మహిళల్లో  ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించి, వారిపై వారికి నమ్మకం, ఆత్మవిశ్వాసం పెంపొందించి అంతర్గతంగానూ శక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు అనేక రకాల వీడియోలను అప్‌లోడ్‌ చేస్తోంది. కెమెరా ముందు తమను తాము ఎంత అందంగా చూపించవచ్చో కూడా నేర్పిస్తుంది. తన యూట్యూబ్‌ చానల్‌లో..ముఖ్యంగా మహిళల ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ ఎంతోమందికి ఫిట్‌గా ఎలా ఉండాలో అవగాహన కల్పిస్తోంది. అంతేగాక వన్‌ ఆన్‌ వన్‌ ఇమేజ్‌ కోచింగ్, ఫేస్‌ యోగా, ఫోటోగ్రఫీలలో శిక్షణ ఇస్తోంది. పర్మితా ఫిట్‌నెస్‌ ఐడియాలు నచ్చడంతో ఆమె చానల్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య దాదాపు ఇరవై లక్షలకు చేరింది.                                        

మరిన్ని వార్తలు