వింత కేసు: ముప్పైలో గర్భం దాల్చగా.. 92 ఏళ్ల వయసులో ప్రసవం!

19 Aug, 2023 13:35 IST|Sakshi

వైద్యులనే అవాకయ్యేలా చేసిన అత్యంత వింత కేసు ఇది. సాధరణంగా మనుషులు గర్భం దాల్చితే తొమ్మిది లేది పదో నెలలో డెలిరీ అవుతుంది. ఇది సహజం. కానీ ఏకంగా 60 ఏళ్లు గర్భాన్ని మోయడం, తొమ్మిది పదుల వయసులో ప్రసవించటమా!. ఇదేం విచిత్రం అనిపిస్తుంది కదూ. అన్నేళ్లు గర్భంలో ఎలా మోసింది. ఆ తల్లి బిడ్డలు బతికే ఉన్నారా? ఇది సాధ్యమేనా? ఎన్నో సందేహాలు వైద్యులను సైతం ఒకింత గందరగోళానికి గురిచేశాయి. ఆమె అన్నేళ్లు ఆ గర్భాన్ని మోస్తూ ఎలా బతికిందా అని డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ వింత ఘటన చైనాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. చైనాకు చెందిన మహిళ హువాంగ్‌ యిజున్‌(92) 1948లో 31 ఏళ్ల వయసులో ఉండగా గర్భం దాల్చింది. అయితే ఆ పిండం ఆమె గర్భాశయానికి వెలుపల పెరుగుతోందని, ఇది ఇరువురికి ప్రమాదమని చెప్పారు. వెంటనే ఆమెను వైద్యులు అబార్షన్‌  చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఆ పిండ ఎదగదని అబార్షన్‌ అవుతుందని చెప్పారు కూడా. ఐతే ఆర్థిక ఇబ్బందులు రీత్యా హువాంగ్‌ యిజున్‌ ఆ పిండాన్ని తీయించేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఏదైతే అది అవుతుందని భావించి అలానే ఉండిపోవాలనుకుంది. విచిత్రంగా ఆమెకు ఎలాంటి నొప్పి గానీ గర్భ విచ్ఛతి అయినట్లుగా బ్లీడింగ్‌ అవ్వలేదు. ఇక ఆమె ఆ గర్భంతో అలానే మోస్తూ వచ్చింది.

బతికే ఉంటుందన్న ఆశ, లేక బిడ్డ కడుపలోనే బతుకుతుందో అనుకుందో గానీ అలానే 61 ఏళ్లు గడిపింది. చివరికి తొమ్మిది పదుల వయసులో వైద్యులను ఆశ్రయించింది. వారు ఆమెను చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆమె చెప్పింది నిజేనా అని అన్ని రకాలు పరీక్షలు నిర్వహించగా..వైద్యులంతా ఒక్కసారిగి ఆశ్చర్యపోయారు. ఇదసలు ఊహకే అందని వింత కేసు అన్నారు. ఆమె కడుపులోపల ఆ బిడ్డ చనిపోయి స్లోన్‌లా మారి అలా ఉండిపోయిందని చెప్పారు. ఇలా జరగడం అత్యంత అరుదని. ఎలాంటి ఇన్ఫెక్షన్‌ తలెత్తకుండా ఆమె చనిపోయిన పిండతో అలానే ఉండిపోవడం మాత్రం నిజంగా షాకింగ్‌గా ఉందన్నారు.

చివరికి వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆ స్టోన్‌ బేబిని బయటకు తీశారు. వైద్య చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన వింత కేసు ఇది అని అన్నారు. అందుకు సంబంధించన ఫోటోలు, హువాంగ్‌ యిజున్‌ కథ నెట్టింట తెగ వైరల్‌ అవ్వుతోంది. దీంతో నెటిజన్లు 61 ఏ‍ళ్లు ప్రెగ్నెన్సీనా! అని ఆశ్చర్యపోతున్నారు. చైనాలో చాలామంది ప్రజలు వైద్య సదుపాయాన్ని పొందలేకపోతున్నురాని చెప్పడానికి ఈ కథే నిదర్శనం.

(చదవండి: ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది!..సరిగ్గా 11 రోజుల తర్వాత..)

మరిన్ని వార్తలు