Hair Care: చుండ్రు నివారణకు ఈ చిట్కాలు పాటిస్తే..

10 Feb, 2023 05:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తలలో చుండ్రు సమస్య ఈ కాలం అధికంగా విసిగిస్తుంటుంది. దీనికి కారణం మాడు పై భాగం పొ డిబారడం వల్ల తెల్లటి పొ ట్టులాంటి మృతకణాలు బయటకు కనిపిస్తుంటాయి. దీనివల్ల దురద కూడా ఉంటుంది. ఈ సమస్య నివారణకు.. 

ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో అరటిపండు గుజ్జును బాగా కలపా లి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి పది నిమిషాల తర్వాత వెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి.
కలబంద గుజ్జును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును నివారించడమే కాకుండా మాడుపైన దురద వంటి చర్మ సమస్యలనూ నివారిస్తుంది. వెంట్రుకలకు మృదుత్వాన్ని ఇస్తుంది.

♦ చిన్న అల్లం ముక్కను సన్నగా తరగాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత కుదుళ్లకు నూనె పట్టేలా మర్దనా చేయాలి. గంట సేపు ఆలాగే ఉంచి, ఆ తర్వాత తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు తగ్గుతుంది.
కప్పు నీళ్లలో 2–3 టేబుల్‌ స్పూన్ల ఉప్పు కలపా లి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి.
వేప నూనె, ఆలివ్‌ ఆయిల్‌ సమపా ళ్లలో కలిపి వేడి చేయాలి. గోరువెచ్చని ఈ నూనెను తలకు పట్టించి వేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత రసాయనాల గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి.
బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్‌ని చుట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చుండ్రు నివారణకు ఉపయోగించే షాంపూతో తలస్నానం చేయాలి.

చదవండి: ఆమె నిన్నటి మేటి హీరోయిన్.. కళ్ళతోనే నటించేది! ఇప్పుడేమో ఇలా.. చెబితే నమ్మరు గానీ..

మరిన్ని వార్తలు