Reheating Cooking Oil: వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..

27 Jun, 2022 16:25 IST|Sakshi

పెదవాల్తేరు(విశాఖపట్నం): ఇంట్లోను, హోటళ్లలోను ఒకసారి వినియోగించిన వంట నూనెను పదేపదే ఉపయోగించడం పరిపాటి. కానీ అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం చాలా మందికి తెలియదు. దీనిపై ఇప్పుడిప్పుడే అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నారు. వాడిన వంటనూనెతో తయారైన ఆహారం తీసుకోవడం ద్వారా గుండెజబ్బులు, లివర్‌ జబ్బులు, హైపర్‌టెన్షన్, అల్జీమర్‌ వంటి వ్యాధులు సోకుతాయని జిల్లా ఆహార భద్రత శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
చదవండి: మీకు తెలుసా?.. విద్యుత్‌ శాఖ నుంచి మెసేజ్‌లు రావు 

కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన ఎన్‌ఎస్‌ఆర్‌ ఇండస్ట్రీస్‌ ఒకసారి వాడిన వంట నూనెను కొనుగోలు చేస్తుంది. ఇప్పటికే విశాఖలోని పలు హోటళ్లలోను, గేటెడ్‌ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్లలోను వాడిన వంటనూనె సేకరణ కోసం డ్రమ్ములు కూడా ఏర్పాటు చేశారు. లీటర్‌ అయిల్‌కు రూ.30 వంతున చెల్లిస్తారు. అపార్ట్‌మెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, హోటల్‌ యజమానులు వాడిన వంటనూనె విక్రయాల కోసం సదరు సంస్థను సంప్రదించాలని ఆహార భద్రత శాఖ అధికారులు కోరుతున్నారు. ఈ నూనె సాయంతో బయోడీజిల్‌ తయారు చేస్తారు. ఫలితంగా పెరుగుతున్న చమురు ధరల నుంచి ఉపశమనం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. 

వంట నూనె సేకరణ సంస్థ,
ఎన్‌ఎస్‌ఆర్‌ ఇండస్ట్రీస్‌
సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌ 91605–14567  

మరిన్ని వార్తలు