మన తిండి మారిపోతోంది!

4 Apr, 2021 19:49 IST|Sakshi

ఆహారపు అలవాట్లలో కోవిడ్‌ తెచ్చిన మార్పు!

రుచి, శుచి, నాణ్యతపై ప్రజల్లో పెరిగిన అవగాహన

‘రెడీ టు ఈట్‌ ఫుడ్‌’ ప్రొడక్ట్స్‌కు పెరిగిన డిమాండ్‌

ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార విలువలున్న పదార్థాల కొనుగోళ్లకు ఆదరణ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రజల జీవన విధానం, ఆహార అభిరుచుల్లో భారీగా మార్పులు తెచి్చంది. గతంలో మన ఆలోచనా విధానాన్ని బట్టి అంతగా ఉపయోగించని వాటిని ఇప్పుడు అనివార్యంగా అలవాటు చేసుకోక తప్పడం లేదు. కొత్త జీవనశైలిని, అలవాట్లను ఆహా్వనించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ కారణంగా గతేడాదిలో ఎక్కువ భాగం నిత్యావసర సరుకులు, వర్క్‌ఫ్రంహోం పని విధానానికి అవసరమైన వస్తువులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. అయితే క్రమంగా కరోనాని ఎదుర్కొనేందుకు పరిశుభ్రతా చర్యలు, జాగ్రత్తల పట్ల ప్రజల్లో అప్రమత్తత పెరిగింది.

‘రెడీ టు ఈట్‌’డిమాండ్‌ 200 శాతం..
పెద్దగా శ్రమ పడకుండానే తాము కోరుకున్న ఆహారపదార్థాలు తయారు చేసుకునేందుకు ఉద్దేశించిన ‘రెడీ టు ఈట్‌ మీల్స్‌’కు డిమాండ్‌ దాదాపు 200 శాతం పెరిగింది. ఇవేకాకుండా రోజువారి ఉపయోగించే వివిధ నిత్యావసర వస్తువులు, కాస్త ఆకలి అనిపించగానే లేదా ఏదైనా లైట్‌గా తినేందుకు వీలుగా వివిధ రకాల స్నాక్స్‌ ఐటెమ్స్‌కు డిమాండ్‌ పెరిగింది. బేకింగ్, ఇంట్లోనే పిజ్జా తయారీ, ఇతర చిరుతిండికి కావాల్సిన వస్తువుల అమ్మకాలు ఎన్నో రెట్లు పెరిగాయి. పౌష్టికాహారంపై కూడా ప్రజల్లో ధ్యాస పెరిగింది. రోగనిరోధకశక్తి పెంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. 

రుచి, పోషకాలు.. రెండింటిపై దృష్టి.. 
బ్రాండెడ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ సేఫ్‌ అనే అభిప్రాయంతో ప్రజలున్నారు. మనరాష్ట్రంలో రెడీ టు కుక్‌ సెగ్మెంట్‌ అనేది బాగా పెరుగుతోంది. సులభంగా తయారు చేసుకోవడంతో పాటు అనేక రకాల రుచులు అందుబాటులోకి వచ్చాయి. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇళ్లలోనే ఇష్టమైన ఆహారం తయారు చేసుకునే అవకాశంతో పాటు శుభ్రత, రక్షణకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. మెంతికూర చపాతీ, రాగి చపాతీ, మునగాకు చపాతీ (మొరింగా), హోల్‌ వీట్‌ పూరీ, మసాలా పరోటా వంటి వాటిపై మేము ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నాము. ఫైబర్‌ రిచ్, ఆయిల్‌ తక్కువ పీల్చే ప్రొడక్ట్‌లకు డిమాండ్‌ ఉంది. భౌతిక దూరం పాటించడంకోసం ఆన్‌లైన్‌ ఆర్డర్లపై వినియోగదారులు ఆధారపడుతున్నారు. ఆన్‌లైన్‌ సెగ్మెంట్‌తో పాటు రెడీ టు కుక్‌ ప్రొడక్ట్స్‌కు డిమాండ్‌ పెరిగింది. 
– ప్రతిమ విశ్వనాథ్, ఎండీ, మంగమ్మ ఫుడ్స్‌  

నాన్‌ వెజ్‌ ఫుడ్‌కు భారీ డిమాండ్‌ 
నాన్‌ వెజిటేరియన్‌ ఫుడ్‌కు ప్రస్తుతం డిమాండ్‌ పెరిగింది. బిర్యానీ, పలావ్, చికెన్‌ కర్రీ ఇతర వేరియెంట్లను జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మా ప్రొడక్ట్‌ లైనప్‌లో బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా దాల్‌ కిచిడీ, పొంగల్, రవ్వ ఉప్మా వంటివి ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. దీంతో పాటు హైదరాబాద్‌లో ‘రెడీ టు ఈట్‌’ఫుడ్‌ ఐటెమ్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. కేవలం వేడి నీటిలో ఉడకపెడితే ఫుడ్‌ రెడీ అయిపోయేలా మేము తయారు చేసిన రెడీ టు ఈట్‌ ఆహార ఉత్పత్తులపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాత మేం మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ మా అమ్మకాల పెరుగుదల, డిమాండ్‌ను బట్టి రెడీ టూ ఈట్‌ కేటగిరీ ప్రొడక్ట్స్‌ను మనవాళ్లు ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. మార్కెట్‌లో రిటైలర్లు, బిజినెస్‌మెన్‌ల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ కూడా ఇదే. శుభ్రత, రుచి, నాణ్యతా ప్రమాణాలు ఇప్పుడు కీలకంగా మారాయి. బయటి ఫుడ్‌ ఆరోగ్యానికి మంచికాదన్న భయాల నుంచి మంచి రెడీ టు ఈట్‌ ఫుడ్‌ బ్రాండ్స్‌పై మొగ్గుచూపుతున్నారు.
– రాజు వానపాల, ఫౌండర్‌ అండ్‌ సీఈవో, ద టేస్ట్‌ కంపెనీ

మరిన్ని వార్తలు