రొమ్ము క్యాన్సర్‌ ముప్పును ముందే గుర్తించండి!

19 Sep, 2021 13:00 IST|Sakshi

రొమ్ముక్యాన్సర్‌కు అనేక అంశాలు కారణమవుతాయి. అందులో కొన్ని మనం నివారించగలవి. మరికొన్ని నివారించలేనివి. ఉదాహరణకు... నివారించలేని వాటిల్లో  వయసు అనేది ముప్పును పెంచే అతి ముఖ్యమైన అంశం. వయసు ఎంతగా పెరుగుతుంటే.. రొమ్ము క్యాన్సర్‌ ముప్పు అంతగా పెరుగుతుంది. ఒక అధ్యయనం ప్రకారం 30 నుంచి 39 ఏళ్ల మహిళల్లో ప్రతి 233 మందిలో ఒకరికి రొమ్ముక్యాన్సర్‌ వచ్చే అవకాశం
చదవండి: మహిళల్లో ప్రధాన క్యాన్సర్ అదే.. వారికే రిస్క్‌

కుటుంబ నేపథ్యం: దగ్గరి బంధువుల్లో (అంటే... అమ్మ, సోదరి, కూతుళ్ల)లో  రొమ్ముక్యాన్సర్‌ ఉన్నట్లయితే... తమకూ రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఎక్కువ. 
వ్యక్తిగత నేపథ్యం: ఇదివరకే రొమ్ముక్యాన్సర్‌ ఉన్నవారైతే... వారికి అదే రొమ్ములోగానీ  మరోపక్క రొమ్ములోగానీ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. 
ఈస్ట్రోజెన్‌: ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ రొమ్ముకణాలను ఉత్తేజపరుస్తుంది. అలా దీర్ఘకాలంపాటు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌కు గురికావడం కూడా రొమ్ముక్యాన్సర్‌ వచ్చే అవకాశాలను పెంచుతుంది. అయితే ఈస్ట్రోజెన్‌ను నియంత్రించడం కొన్నిసార్లు మన చేతుల్లో ఉండదు. ఉదాహరణకు చిన్నవయసులోనే అంటే పన్నెండేళ్ల కంటే తక్కువ వయసులోనే నెలసరి ప్రారంభం కావడం, అలాగే 55 ఏళ్లు తర్వాత బహిష్టు ఆగిపోవడం (మెనోపాజ్‌) లాంటి కారణాలతో ఈస్ట్రోజెన్‌ స్రావాలు చాలా  సుదీర్ఘకాలంపాటు కొనసాగితే కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే బయటి నుంచి శరీరంలోకి ప్రవేశించే ఈస్ట్రోజెన్‌ కూడా ఎవరి చేతుల్లోనూ ఉండదు. (అంటే మాంసాహారంలో ఉండే హార్మోన్ల వల్ల, పురుగుమందుల అవశేషాల కారణంగా దేహంలోకి ప్రవేశించే ఈస్ట్రోజెన్‌ను పోలిన అంశాలు కూడా ఈ ముప్పును పెంచుతాయి). 
చదవండి: ఒక ఓవరీ తీసేశారు.. నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా?

గర్భధారణ... పిల్లలకు తల్లిపాలు పట్టించడం : గర్భం రావడంతో పాటు చిన్నారికి రొమ్ముపాలు పట్టించడం వంటి అంశాలు నెలసరుల సంఖ్యను తగ్గిస్తాయి. తద్వారా క్యాన్సర్‌ ముప్పు కూడా తగ్గుతుంది. ముప్ఫయి ఏళ్లు పైబడేవరకు గర్భం ధరించని మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే చాలాకాలం పాటు... అంటే ఏడాది మొదలుకొని ఏడాదిన్నర లేదా రెండేళ్ల వరకు తల్లిపాలనే తాగించే మహిళలకు రొమ్ముక్యాన్సర్‌ ముప్పు తక్కువ. కానీ ఈరోజుల్లో అంత సుదీర్ఘకాలం పాటు తల్లిపాలు పట్టించడం సాధ్యంకావడంలేదు. 

కొన్నిసార్లు మన చేతిలో ఉన్న అంశాలపరంగా  (అంటే మంచి ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి) తగిన జాగ్రత్తలు తీసుకున్నా కూడా రొమ్ముక్యాన్సర్‌ రావచ్చు. అలాంటప్పుడు కుంగిపోకూడదు. సాధారణంగా బ్రెస్ట్‌క్యాన్సర్‌ అన్నది రొమ్ములో కణుతుల రూపంలో బయటపడుతుంది. ఈ కణుతులు నొప్పి లేకుండా, గట్టిగా, సమానమైన అంచులు లేకుండా ఉండవచ్చు. మరికొన్నిసార్లు మెత్తగా, సమానంగా కూడా ఉండవచ్చు. కాబట్టి రొమ్ముల్లో ఏమాత్రం మార్పు కనిపించినా వెంటనే డాక్టరుకు చూపించుకోవడం మంచిది. సాధారణంగా రొమ్ముక్యాన్సర్‌ సోకినప్పుడు ఈ కింద పేర్కొన్న మార్పులు కనిపిస్తాయి. అవి... 
చదవండి: షుగరూ, హైబీపీ అదుపులో ఉంటే కిడ్నీలూ పదిలమే

►రొమ్ముల్లో వాపు, ఇరిటేషన్, నొప్పి, చనుమొనల్లో నొప్పి, చనుమొనలు లోపలివైపునకు కుంగినట్లుగా అయిపోవడం, ఎరుపెక్కడ, చనుమొనల నుంచి పాలు కాకుండా ఇతర ద్రవాలు స్రవించడం, చంకల కిందిభాగంలో గడ్డలు ఉండటం... మొదలైనవి. అయితే అన్ని రకాల గడ్డలూ క్యాన్సర్‌ కాకపోవచ్చు. కాబట్టి డాక్టర్‌ చేత క్షుణ్ణంగా పరీక్ష చేయించుకుని, అది క్యాన్సరా, కాదా అని నిర్ధారణ చేసుకోవడం మంచిది.
►క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత సులువుగా చికిత్స చేయవచ్చు. దాన్ని త్వరగా గుర్తించడానికి ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడమే సరైన మార్గం.
►ఇరవై ఏళ్ల వయసు దాటిన మహిళలు ప్రతినెలా రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవాలి. ∙20 నుంచి 40 ఏళ్ల వయసు మహిళలు ప్రతి మూడేళ్లకోసారి డాక్టర్‌ ఆధ్వర్యంలో రొమ్ము పరీక్షలు జరిగేలా చూసుకోవాలి.
►40 ఏళ్లు పైబడిన మహిళలు ప్రతి ఏడాదీ పరీక్ష చేయించుకోవాలి.
►40 –49 ఏళ్ల మహిళలు ప్రతి రెండేళ్లకోసారి డిజిటల్‌ మామోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలి. 50 ఏళ్లు పైబడిన మహిళలు ప్రతి ఏడాదీ డిజిటల్‌ మామోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలి. 

►డిజిటల్‌ మామోగ్రఫీ అనేది డిజిటల్‌ రెసెప్టార్‌తో కంప్యూటర్‌కు అనుసంధానం చేసిన ఒక ఆధునిక ఎక్స్‌–రే మెషీన్‌గా చెప్పవచ్చు. దాని ద్వారా అత్యంత సులువుగా, వేగంగా బయాప్సీ చేయవచ్చు. మరీ ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న అధునాతన డిజిటల్‌ మామోగ్రఫీ మెషీన్స్‌తో బెడ్‌లో కాసేపు పడుకుని లేదా కూర్చుని కూడా అత్యంత వేగంగా బయాప్సీని నిర్వహించవచ్చు. మామోటోమ్‌ వంటి వాక్యూమ్‌ పవర్డ్‌ పరికరాల వల్ల అత్యంత ఖచ్చితంగా మల్టిపుల్‌ బయాప్సీ చేయవచ్చు. ఈ పరీక్షల సహాయంతో రొమ్ముక్యాన్సర్‌ లేదని నిర్ధారణ అయితే నిశ్చింతగా, నిర్భయంగా ఉండవచ్చు. ఒకవేళ ఉందని తేలితే వెంట

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు