-

Dhanteras- Gold: గోల్డ్‌ గురించి బోలెడు విషయాలు తెలుసుకొని మరీ కొంటున్న యువత! ఈ ఆసక్తి ఎందుకంటే?!

13 Oct, 2022 10:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యూత్‌ పల్స్‌.. లవ్‌ యూ ‘బంగారం’

అక్షయ తృతీయ, ధనత్రయోదశి రోజులలో బంగారం కొంటే మంచిది అనే సెంటిమెంట్‌ గురించి వీరికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ‘హాల్‌మార్క్‌ సింబల్‌ ఏం తెలియజేస్తుంది?’ అనేదాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవచ్చు. అయితే ఇది ఒకప్పటి విషయం. ఇప్పుడు యూత్‌ ‘లవ్‌ యూ బంగారం’ అనడం మాత్రమే కాదు గోల్డ్‌ గురించి బోలెడు విషయాలు తెలుసుకొని మరీ కొనుగోలు చేస్తోంది...!

ఆరోజుల్లో ఒకరోజు...తన బర్త్‌డేకు ఫ్రెండ్‌ని ‘గోల్డ్‌ రింగ్‌’ని గిఫ్ట్‌గా అడిగింది ఆమె. ‘నువ్వే 50 కేజీల బంగారం. నీకు బంగారం ఎందుకు బంగారం!’ అని ఆ ఫ్రెండ్‌ అన్నాడట. అయితే ఈ మిలీనియల్స్‌ జమానాలో అలాంటి డైలాగులతో తప్పించుకోవడం అసాధ్యం. అప్పుడూ, ఇప్పుడూ బంగారం అంటే బంగారమే!

ఒకప్పుడంటే... బంగారం కొనుగోలు అనేది వివాహాది శుభకార్యాలలో పెద్దల వ్యవహారం. అయితే గత కొంత కాలంగా యూత్‌లో చిన్న మొత్తంలో అయినా బంగారం కొనుగోలు చేయడాన్ని ఇష్టపడే ధోరణి పెరుగుతోంది. 18–క్యారెట్ల వేర్‌/ఫ్యాషన్‌ జ్యువెలరీ ఆన్‌లైన్‌ షాపింగ్‌లో మిలీనియల్స్‌ చురుగ్గా ఉన్నట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజిసి) రిపోర్ట్‌ తెలియజేస్తుంది.

మిలీనియల్స్‌ నుంచి కూడా డిమాండ్‌ ఏర్పడడంతో ఇండియన్‌ జ్యువెలరీ ఆన్‌లైన్‌ మార్కెట్‌ వేగం పెరిగింది. పెద్ద సంస్థలు యూత్‌ని దృష్టిలో పెట్టుకొని తేలికపాటి బరువుతో, స్టైలిష్‌గా ఉండే సబ్‌–బ్రాండ్స్‌ను లాంచ్‌ చేశాయి. అమ్మాయిలలో ఎక్కుమంది గోల్డ్‌ ఇయర్‌ రింగ్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. బరువును పెద్దగా పట్టించుకోవడం లేదు. యూత్‌ని దృష్టిలో పెట్టుకొని కొత్త మార్కెటింగ్, ఎడ్వర్‌టైజింగ్‌ స్ట్రాటజీలు మొదలయ్యాయి.

‘కష్టకాలంలో అక్కరకొస్తుంది’ అనే భావనతో కాస్తో,కూస్తో బంగారం కొనుగోలు చేయడం అనేది పెద్దల సంప్రదాయం. కానీ ఈతరంలో ఎక్కువమందికి ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లాగే గోల్డ్‌ అనేది లగ్జరీ ఫ్యాషన్‌.  ‘గోల్డ్‌ అంటే మా దృష్టిలో లగ్జరీ ఫ్యాషన్‌ మాత్రమే’ అనే స్టేట్‌మెంట్‌కు యువతరంలో కొద్దిమంది మినహాయింపు.

దీనికి ఒక ఉదాహరణ చెన్నైకి చెందిన సచిత. ‘గతంలో స్టాక్‌మార్కెట్‌పై ఆసక్తి ఉండేది. ఆసక్తి మాత్రమే ఉంటే సరిపోదు. చాలా విషయాలు తెలిసి ఉండాలి అనేది తెలుసుకున్నాక గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆసక్తి పెరిగింది’ అంటోంది సచిత. తమ ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ను దృష్టిలో పెట్టుకొని గోల్డ్‌ను సేఫెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌గా చూస్తున్న సచితలాంటి వాళ్లు యువతరంలో ఎంతోమంది ఉన్నారు.

చదవండి: Podcast: ఆత్మీయనేస్తంగా పాడ్‌కాస్ట్‌! యూత్‌కు దగ్గరైన జానర్‌లలో అగ్రస్థానంలో ఉన్నది ఏమిటంటే!

మరిన్ని వార్తలు