ధూర్జటి కవి విరచిత

28 Jan, 2021 07:01 IST|Sakshi

శ్రీకాళహస్తీశ్వర శతకం

పద్యం 12 
నిను సేవింపగ నాపదల్వొడమ నీ  నిత్యోత్సవంబబ్బనీ  జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పైకొననీ జ్ఞానము గల్గనీ గ్రహగతుల్‌ కుందింపనీ మేలువచ్చినరానీ యని నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా ! 

భావం : శ్రీకాళహస్తీశ్వరా! నిన్ను సేవిస్తున్నప్పుడు ఆపదలొస్తేరానీ ! సంతోషం నన్నొక సామాన్యుడనని అంటే అననీ! మహాత్ముడనని అంటే అననీ! సంసారమోహం పెరిగిపోతే పెరిగిపోనీ! జ్ఞానం వస్తే రానీ! గ్రహాల కదలిక నన్ను ఇబ్బంది పెడితే పెట్టనీ! మేలు చేస్తే చెయ్యనీ! ఏం జరిగినా అన్నీ నాకు అలంకారాలే ప్రభూ! 

పద్యం 13        
ఏ వేదంబు పఠించెలూత, భుజగంబేశాస్త్రముల్చూచె దానే విద్యాభ్యాసనంబొనర్చెగరి, చెంచేమంత్రమూహించె, బోధావిర్భావనిదానముల్‌ చదువులయ్యా? కావు! మీ పాదసం సేవాసక్తియె కాక జంతుతతికిన్‌ శ్రీకాళహస్తీశ్వరా! 

భావం: శ్రీకాళహస్తీశ్వరా! నీ పాదసేవపట్ల ఆసక్తియే జీవులకు జ్ఞానాన్ని  కలుగజేస్తుంది. కాని, ఏ చదువులూ జ్ఞానాన్ని ప్రసాదించవు. సాలెపురుగు ఏ వేదాలను  చదివింది? సర్పం ఏశాస్త్రాలను పఠించింది? ఏనుగు ఏ చదువులు  నేర్చుకుంది? ఆ చెంచు ఏ మంత్రాలను జపించాడు? ... లేదు కదా ?    
తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం

మరిన్ని వార్తలు