Best Foods For Diabetics: మధుమేహం ఉంటే అన్నం తినడం మానేయాలా?

22 Oct, 2021 08:13 IST|Sakshi

అన్నం తినడం వల్లనే డయాబెటిస్‌ పెరుగుతుంది అనుకుంటూ ఉంటారు చాలామంది. తెలుగు రాష్ట్రాలలో వందల ఏళ్లుగా అన్నం తింటునే ఉన్నాం. కానీ డయాబెటిస్‌ మాత్రం ఇటీవలి కాలంలోనే పెరిగింది. కాబట్టి తినే అన్నానికీ, రక్తంలో ఉండే చక్కెరకూ పెద్దగా సంబంధం లేదు. అయితే అన్నంతో పాటు వేపుడు కూరలు, ఇతర పిండివంటలు కూడా బాగా లాగిస్తే మాత్రం కష్టమే. లో కార్బ్‌ డైట్‌ వల్ల ఉపయోగం ఏమీ లేదు. పైగా ఆహారంలో పిండి పదార్థాన్ని తగ్గిస్తే ఆటోమేటిగ్గా కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటాం. దాంతో డయాబెటిస్‌ వచ్చే అవకాశం పెరుగుతుంది. కొవ్వు పదార్థాల వల్ల సమస్య గానీ పిండి పదార్థం వల్ల కాదు. అందుకే అన్నం మానడం అంత ప్రయోజనకరం ఏమీ కాదు. 
అపోహ
షుగర్‌ రోగులు పండ్లు తినకూడదు
వాస్తవం: ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు మామిడి, సీతాఫలం లాంటివైనా సరే వాటివల్ల మధుమేహం వస్తుందనడం సరికాదు. డయాబెటిస్‌ ఉన్నవాళ్లు కూడా నోరు కట్టుకోనక్కరలేదు. కొద్ది మొత్తంలో తినొచ్చు. ఈ పండ్లలో ఉండే పిండిపదార్థం వేరు. చక్కెర వ్యాధిలో ఉండే చక్కెర వేరు. పండ్లలో యాంటి ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, క్యాన్సర్‌ రాకుండా నివారించే పదార్థాలూ ఉంటాయి. అందుకే డయాబెటిస్‌ ఉన్నంత మాత్రాన పండ్లను దూరం పెట్టనక్కరలేదు. పండ్లు తినొచ్చు. అయితే మితమే హితమని గుర్తు పెట్టుకుని ఎక్కువగా తినరాదు.  

మరిన్ని వార్తలు