Elephant Milk: ఈ జంతువు పాలల్లో కాల్షియం కాదు, ఆల్కహాల్‌ ఉంటుంది..

13 Oct, 2023 13:14 IST|Sakshi

పాలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికి తెలిసిందే. సాధారణంగా మనలో చాలామంది ఆవు లేదా గేదె పాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఓ జంతువు పాలు తాగితే మాత్రం ఆరోగ్యానికి చాలా ప్రమాదరమట. ఇలాంటి పాలను అస్సలు తాగొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

పాలల్లో కాల్షియం ఉంటుందని తెలుసు కానీ.. ఈ జంతువు పాలల్లో మాత్రం ఆల్కహాల్‌ ఉంటుందని మీకు తెలుసా? అవును. అడవిలో గజరాజుగా మనందరికి తెలిసిన ఏనుగు పాల గురించి ఈ చర్చంతా. ఏనుగు పాలల్లో బీర్, విస్కీ లేదా వైన్ కంటే ఎక్కువ శాతం ఆల్కహాల్ శాతం ఉంటుందట. అంతేకాకుండా ఏనుగు పాలు తాగడం వల్ల మత్తు రావడమే కాకుండా వెంటనే మూర్ఛపోతారట. అంత డేంజర్‌ మరి.

ముఖ్యంగా ఆడ ఏనుగు పాలల్లో శాతం ఆల్కహాల్ లెవల్స్ ఉంటాయి.నిజానికి, ఏనుగు చెరకు తినడానికి ఇష్టపడుతుంది. చెరకులో పెద్ద మొత్తంలో ఆల్కహాల్-ఫార్మింగ్ ఎలిమెంట్స్ ఉంటాయనే విషయం తెలిసిందే.ఇదే ఏనుగు పాలలో ఆల్కహాల్ శాతం పెరగడానికి కారణమవుతుంది. ఏనుగు పాలు చాలా ప్రమాదకరం. వీటిలో ఉండే రసాయనాలు మనుషులకు హానీ చేస్తాయట.

ఈ పాలల్లో బీటా కేసైన్ ఉంటుంది. దీని కారణంగా పాలలో అధిక స్థాయిలో లాక్టోస్ ఉంటుంది.  ఆఫ్రికన్ ఆడ ఏనుగులలో అధిక స్థాయిలో లాక్టోస్, ఒలిగోశాచురైడ్లు ఉంటాయి. అందుకే మానవులు రెండు సిప్స్ తాగిన తర్వాత మూర్ఛపోతారని వైద్యులు హెచ్చరిస్తారు. ఈ పాలలోని కార్బోహైడ్రేట్ అధిక పరిమాణంలో ఉంటాయి. వీటి కారణంగా వీటిని తాగితే  కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

మరిన్ని వార్తలు