Diwali 2022: ప్యాంట్‌ శారీ.. చెవులకు పెద్ద హ్యాంగింగ్స్‌, ఫిష్‌ టెయిల్‌.. మీరే హైలైట్‌!

21 Oct, 2022 10:20 IST|Sakshi

ప్యాంట్‌ శారీ

సంప్రదాయ వేడుకల్లో చీరకట్టు, లంగా ఓణీ అమ్మాయిల ఎవర్‌గ్రీన్‌ డ్రెస్‌గా ఉంటుంది. కానీ, ఆ‘కట్టు’కోవడంలో పెద్ద ఇబ్బందిగా ఫీలవుతుంటారు. పెద్దవారిలా చీరకట్టు ఎందుకు అని ప్రశ్నించే నవతరం పెద్దవారు సైతం మెచ్చేలా డ్రెస్సింగ్‌ ఉండాలంటే ప్యాంట్‌ శారీ సరైన ఎంపిక అవుతుంది. స్టైలిష్‌ జాబితాలో ముందు వరసలో ఉంటుంది. వేడుకలలో హైలైట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ దీపావళి మరింత శోభాయమానం అవుతుంది.

కుర్తీస్‌కి పలాజో ప్యాంట్‌ ధరించడం మనకు తెలిసిందే. పలాజో టాప్‌ విత్‌ దుపట్టాతో లుక్‌లో మార్పు తీసుకురావచ్చు. అలాగే, పలాజో స్కర్ట్, షరారా ప్యాంట్, స్ట్రెయిట్‌ కట్‌ ప్యాంట్స్‌ కూడా ఈ స్టైల్‌కు బాగా నప్పుతాయి. 

కాంట్రాస్ట్‌
ప్యాంట్‌–టాప్‌ సేమ్‌ ప్లెయిన్‌ కలర్‌లో ఉండి, దీనికి కాంట్రాస్ట్‌ లేదా ఫ్లోరల్‌ దుపట్టాతో అలంకరిస్తే చాలు. ‘స్టైలిష్‌ లుక్‌ అంతా మీలోనే కనిపిస్తుంది’ అన్న కితాబులు అందుకుంటారు. 

ప్లెయిన్‌ 
ఒకే రంగులో ఉండే ప్లెయిన్‌ శారీ ప్యాంట్‌లు ఈవెనింగ్‌ గెట్‌b టు గెదర్‌ పార్టీలకు బాగా నప్పుతాయి. ఇవి శారీ గౌన్‌ స్టైల్‌లో కనిపించడంతో ఇండోవెస్ట్రన్‌ లుక్‌లో ఆకట్టుకుంటాయి. 

ఆభరణాలు..
డ్రెస్‌తోనే స్టైలిష్‌గా కనిపిస్తారు కాబట్టి ఇతరత్రా అలంకరణలు పెద్దగా అవసరం లేదు. అయితే నడుముకు మాత్రం ఎంబ్రాయిడరీ చేసిన ఫ్యాబ్రిక్‌ బెల్ట్‌ ధరిస్తే లుక్‌ బాగుంటుంది. చెవులకు పెద్ద హ్యాంగింగ్స్‌ పెట్టేస్తే చాలు. కేశాలంకరణలో ఫిష్‌ టెయిల్‌ లేదా లూజ్‌గా వదిలేస్తే ముస్తాబు పూర్తయినట్టే. 

చదవండి: Sobhita Dhulipala: శోభిత కట్టిన ఈ చీర ధర 4 లక్షల 80 వేలు! ఆ బ్రాండ్‌ ప్రత్యేకత అదే!
Gota Work: గోటా పట్టి.. దీపకాంతుల కోసం ముస్తాబులో మరిన్ని వెలుగులు!

మరిన్ని వార్తలు