యాంటీ వాలెంటైన్‌ వీక్‌: చెంప పగలగొట్టు...బ్రేకప్‌ చెప్పేయ్‌..!

15 Feb, 2024 12:48 IST|Sakshi

ఫిబ్రవరి అంటే ప్రేమికుల నెలమాత్రమే కాదు. మరొకటి కూడా ఉంది.  ఫిబ్రవరి 14 వరకు వారంరోజుల పాటు  వాలెంటైన్స్‌ వీక్‌ సందడి ఉంటుంది. అంతా ప్రేమికులకు, ఓకే చెప్పడానికి అయితే.. తిరస్కరించడానికీ, భగ్న ప్రేమికులకీ ఉండాలిగా  అన్నట్టు  యాంటీ వాలెంటైన్స్ వీక్ సందడి కూడా షురూ అవుతుంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి!

రోజ్ డే, ప్రపోజల్ డే, లవ్ డే, కిస్ డే, హగ్ డే, టెడ్డీ డే అంటూ  ప్రేమ పక్షులు సందడి  చేస్తే ..ఫిబ్రవరి 15నుంచి యాంటీ వాలెంటైన్స్‌  వీక్‌ భగ్నప్రేమికులకు, ప్రేమను తిరస్కరించే కిక్కు అన్నట్టు..ఫిబ్రవరి 15న చెంపదెబ్బతో మొదలై, ఫిబ్రవరి 21న బ్రేకప్‌తో తృప్తి పడతారు వాలెంటైన్స్ వీక్ అంతా.

యాంటీ వాలెంటైన్ వీక్
ఫిబ్రవరి 15, స్లాప్ డే: గుండె పగిలిన వారందరూ తమ బాధలన్నింటికీ   కారణమైన తమ మాజీలను చెంపదెబ్బ కొట్టడానికి ఈ రోజు అనుమతిస్తుంది.  ఒక విధంగా ఇది ఇబ్బంది పెట్టే చెడు ఆలోచనలు, జ్ఞాపకాలను దూరం చేసే రోజు. 
ఫిబ్రవరి 16,కిక్ డే: ప్రేమలో మోసం చేసిన వారి జ్ఞాపకాలన్నింటినీ వదిలించుకోవడం,  జీవితంలో నింపిన విషాదాన్ని, కోపాన్ని వదిలేయడం. అంతేకాదు  వాళ్లిచ్చిన గిఫ్ట్స్‌లు, ఇతర గుర్తులను పూర్తిగా  వదిలివేయడం. 
ఫిబ్రవరి 17, పెర్ఫ్యూ‌మ్‌ డే: పదే పదే వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలను మర్చిపోయి, మంచి పరిమళంతో  కొత్త ఆహ్లాదాన్ని నింపుకోవడం
ఫిబ్రవరి 18,  ఫ్లర్ట్ డే: ఈ రోజున కొత్త వ్యక్తిని కలుసుకుని వారితో సరదాగా గడపడం 
ఫిబ్రవరి 19, కన్ఫెషన్ డే:  తప్పులను ఒప్పుకోవడం,  ఎదుటివారిని క్షమించమని అడగడం 
ఫిబ్రవరి 20, మిస్సింగ్‌ డే : ఎవరైనా తమ వాలెంటైన్‌ని  మిస్‌ అవుతున్న ఫీలింగ్‌ ఉంటే వాళ్లకి  మెమొరీస్‌ని గుర్తు చేయడం 
ఫిబ్రవరి 21, బ్రేకప్‌ డే:ఇది కీలకమైందీ.. చివరి రోజు కూడా అవతలి వారి ప్రేమ నిజమైంది కాదనిపిస్తే..ని​స్సందేహంగా వదిలివేయడం హ్యాపీగా  ఉండటం.

ప్రేమ అందమైందే  ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచం  మొత్తం చాలా  చాలా అందంగా కనిపిస్తుంది. కానీ తేడా వస్తే  విడిపోతే  భరించడం కష్టమే. నాకే ఎందుకు ఇలా అనిపిస్తుంది.. కానీ జీవితం అక్కడితో ఆగిపోకూడదు. మనలాంటివాళ్లని దక్కించుకోలేని దురదృష్టవంతులు అనుకొని వదిలేయాలి. నిజానికి గమనిస్తే.. నిస్వార్థంగా మనల్ని మనంగా ప్రేమించే వాళ్లు చాలామంది ఉంటారు. దాన్ని మనం గుర్తించగలగాలి అంతే.

whatsapp channel

మరిన్ని వార్తలు