అవును...ఇది నిజమే!

17 Feb, 2023 03:26 IST|Sakshi

అన్‌ఫ్రెండ్‌’ అనే మాట ఫేస్‌బుక్‌కు ముందు ఉందా? అనే ప్రశ్నకు చాలామంది చెప్పే జవాబు ‘లేదు’ అని. అయితే 13వ శతాబ్దానికి చెందిన కవి లయమన్‌ కవితలో ఈ పదం కనిపిస్తుంది. అప్పటి ఇంగ్లీష్‌ను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అయినా అర్ధం కాకుండా మాత్రం పోదు!
 ‘హెడ్‌లెస్‌ చికెన్‌ మాన్‌స్టర్‌’ గురించి ఎప్పుడైనా విన్నారా? నిజానికి దీనికీ చికెన్‌కు ఎలాంటి సంబంధం లేదు. ‘హెడ్‌లెస్‌ చికెన్‌ మాన్‌స్టర్‌’ అనేది ఒక రకమైన సముద్రపు దోసకాయ. సదరన్‌ ఒషియన్‌కు సమీపంలో దీన్ని కనుగొన్నారు.
 ‘టర్టిల్‌ అనగా ఏమిటి?’ ప్రశ్నకు అందరి నుంచి వినిపించే జవాబు...తాబేలు. స్కాట్‌లాండ్‌లో మాత్రం దీనికి వేరే అర్ధం ఉంది. ఎవరి పేరు అయినా ఎంతకూ గుర్తుకు రాని సందర్భంలో, అసహనానికి, తట్టుకోలేని కో పానికి గురయ్యే సమయంలో ఉపయోగించే మాట ఇది.

మరిన్ని వార్తలు