అల్లం పాలు తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

27 Oct, 2021 12:04 IST|Sakshi

 Benefits of drinking ginger milk:  ఒక కప్పు పాలలో టీ స్పూను అల్లం తురుము వేసి ఐదు నిమిషాలు మరిగించాలి.

తరువాత చిటికెడు మిరియాలపొడి, చిటికెడు దాల్చినచెక్క పొడి, కొద్దిగా బెల్లం తురుము కలపాలి.

గోరువెచ్చగా ఉండగానే ఈ పాలను తాగాలి.

అల్లం పాలను రోజూ తాగడం వల్ల జలుబు, ఫ్లూ, అజీర్ణ వంటి సమస్యలు తగ్గుతాయి. 

అల్లం పాలలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరానికి అందుతాయి.

ముఖ్యంగా చలి కాలంలో ఈ పాలను తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది

చదవండిఎయిర్‌ హోస్టెస్‌ల అర్థనగ్న నిరసనలు.. కారణం అదేనట..!

మరిన్ని వార్తలు