పాములు కాటేసే ముందు హెచ్చరిస్తాయా? ఆ ఒక్క పాము మినహా..

22 Sep, 2023 16:58 IST|Sakshi

పాములు కాటేసే ముందు ముందుగానే హెచ్చరిస్తాయట. ఆ ఒక్క పాము మినహా మిగిలిన అన్ని పాములు ముందుగానే వివిధ శబ్ధాలతో మన్నల్ని హెచ్చరిస్తాయి. నిజానికి అవి నేరుగా కాటేయవని ముందుగా సిగ్నల్‌ ఇస్తాయని నిపుణుల అంటున్నారు. దాన్ని నిశితంగా గమనిస్తే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చట. నిజానికి పాములను చూసి మనం భయపడతాం గానీ వాటికి మనం అంటేనే భయం. అందువల్లే అవి ప్రాణ భయంతో కాటేసే యత్నం లేదా సంకేతం ఇస్తాయట.  

ఒక్క కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ కాటు వేసే ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెప్తున్నారు. కట్లపాము ఒక్కటే ఎప్పుడు కాటువేస్తుందో చెప్పలేం. మిగిలిన పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ "బుస్స్"  "బుస్స్".. అని శబ్ధం చేస్తాయి. శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ శబ్ధం చేసే ప్రయత్నం చేస్తాయి. పాముల ప్రవర్తనను నిశితంగా గమనించగలిగితే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు అని స్నేక్ క్యాచర్ ధర్మేంద్ర త్రివేది అన్నారు.

కట్లపాము విషయానికి వస్తే, రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాము కాటు ప్రమాదాలు చోటచేసుకుంటాయి. మిగిలిన పాములు పంట పొలాలు, నిర్మాణ ప్రదేశాలలో కనిపిస్తాయి. అవి బూడిద, నలుపు, గోధుమ రంగుల్లో ఉంటాయి కాబట్టి, ఈ ప్రదేశాల్లో సులభంగా దాక్కొని ఆహారం కోసం వేటాడతాయని చెబుతున్నారు.


 
పాము కాటు వేసిన వెంటనే ఏం జరుగతుందంటే..
పాము కాటుకు గురైన 15-20 నిముషాల నుంచి విషం ప్రభావం శరీరంలో కనిపించడం మొదలవుతుంది. 30 నుంచి 45 నిముషాల సమయంలో విషం శరీరమంతా వ్యాపిస్తుంది. విషపూరిత లక్షణాలు కనిపించడానికి సుమారు రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతుంది. దాదాపు 4 నుంచి 6 గంటల్లో తీవ్రత గరిష్టస్థాయికి చేరుకుంటుంది. పాము కాటు వేసిన భాగంలో మాత్రమే నొప్పి తీవ్రంగా ఉంటుంది. అయితే, పాము కాటు వేస్తే, లక్షణాలు వెంటనే కనిపించవు” అని అన్నారు.

పాము కాటు వేస్తే ఏం చేయాలి
పాము కాటుకు గురైన వ్యక్తికి ముందు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. ఆందోళన పడకోడదు. సాధ్యమైనంత త్వరగా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి లేదా వైద్యుడి దగ్గరకు వెళ్లాలి.

ఏం చేయకూడదు..?
పాము కాటుకు గురైన వ్యక్తిని కదల్చకూడదు. దీని వలన విషం వేగంగా శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది. గాయానికి కట్టు కట్టడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది. పాము కాటుని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి క్షణమూ విలువైనదే అని గుర్తుంచుకోవాలి. వేసకి కాలంలో బయట సంచరిస్తాయట. శీతకాలంలో నిద్రాణ స్థితిలో ఉంటాయట. వర్షాకాలంలో గుడ్లు పెడతాయట. శీతకాలం వచ్చేలోపు ఈ సమయంలో కావల్సిన ఆహరం కోసం వేట మొదలుపెడతాయట. అందువల్ల ఈ కాలంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. 

(చదవండి: నత్తల విసర్జకాలు, తేనెటీగల విషంతో బ్యూటీ ప్రొడక్ట్స్‌! కొరియన్ల బ్యూటీ రహస్యం ఇదేనా!)

మరిన్ని వార్తలు