మీ పిల్లలు తరచు దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా? 

25 Feb, 2023 00:44 IST|Sakshi

ఇది అటు చలికాలం కాదు, అలాగని పూర్తి వేసవి కాలమూ కాదు... అటూ ఇటూ కానీ సంధికాలం. ఈ కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలే తరచుగా అనారోగ్యం బారిన పడుతుంటారు. వాటిలో ప్రధానమైనవి దగ్గు, జలుబు. అలెర్జీ, దగ్గు, న్యూమోనియా, బ్రాంకైటిస్, అధిక జ్వరం, టాన్స్‌లైటిస్, చెవి ఇన్ఫెక్షన్‌ సమస్యలు పిల్లలకు తరచు సోకుతుంటాయి. 

తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
పిల్లలకు దగ్గు, జలుబు వంటి సమస్యలుంటే కృత్రిమ రంగులు కలిపిన ఆహారాలు, అధిక తీపి, ఎక్కువ చల్లగా ఉండే ఆహారాలను తినిపించకూడదని వైద్యులు సలహానిస్తుంటారు. ఎందుకంటే ఇవి దగ్గును ఎక్కువ చేస్తాయి. అలాగే బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. అంతేకాదు ఇది సంక్రమణ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. 

వీటితోపాటు క్యాండీలు, ఐస్‌ క్రీం, చాక్లెట్లు, డోనట్స్, పేస్ట్రిలు, ద్రాక్ష, రిఫ్రిజిరేటర్‌ లో ఉండే చల్లని ఆహారాలకు పిల్లలను వీలైనంత దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి దగ్గును బాగా పెంచుతాయి. దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు పిల్లలను పంపించకూడదు. ఎందుకంటే ఇవి దగ్గును ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా పిల్లలకు బొమ్మలు ఇవ్వాల్సి వస్తే.. వాటిని వాష్‌ చేసిన తర్వాతే ఇవ్వండి. అలాగే  పావురాలు, ఇతర పెంపుడు జంతువులకు కొద్దిగా దూరంగా ఉంచండి. ఇవి అలెర్జీని కలిగిస్తాయి.                

మరిన్ని వార్తలు