కుక్క కాటుకు గురైనప్పుడు ఏం చేయాలో తెలుసా?

11 Mar, 2021 19:41 IST|Sakshi

చిన్న పిల్లల మీద కుక్కల దాడులు అధికమతున్నాయి. వాటి దాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడుతున్నారు. కుక్క కాటుకు గురైనప్పుడు ఏం చేయాలో, ఎలాంటి జగ్రత్తలు తెలుసుకోండి. ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే.. గాయం తీవ్రతను తగ్గించవచ్చు.
కుక్క కరచినప్పుడు అయిన గాయాన్ని పై నుంచి పడే శుభ్రమైన నీటి ప్రవాహం కింద  కడగాలి. అంటే... మగ్‌తో నీళ్లు పోస్తూ గాని, కుళాయి కింది గాయాన్ని ఉంచి నీళ్లు పడుతుండగా సబ్బుతో, వీలైతే డెట్టాల్‌తో వీలైనంత శుభ్రంగా కడగాలి.
 కుక్క కాటు గాయానికి ఎలాంటి కట్టు కట్టకూడదు. దాన్ని ఓపెన్‌గా ఉంచాలి.
కుక్క కాటు తర్వాత రేబీస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి తక్షణం డాక్టర్‌ను సంప్రదించి యాంటీరేబీస్‌ వ్యాక్సిన్‌ను అవసరాన్ని బట్టి మూడు లేదా ఐదు మోతాదుల్లో ఇప్పించాలి.
 గాయం తీవ్రతను బట్టి ఇమ్యునోగ్లోబులిన్‌ ఇంజెక్షన్స్‌ను గాయం అయిన చోట రెండు డోసులు ఇప్పించి, మిగతాది చేతికి ఇవ్వాల్సి ఉంటుంది.
 గాయం అయిన వైపు ఉండే చేతికి ఇమ్యునో గ్లోబ్యులిన్‌ ఇంజెక్షన్‌ ఇచ్చి... ఆ రెండో వైపు చేతికి యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ను ఇవ్వాలి. 

మరిన్ని వార్తలు