Online gambling: ఆన్‌లైన్‌లో జూదమా?.. జర జాగ్రత్త..!

21 Jul, 2022 07:38 IST|Sakshi

ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ కారణంగా ఇటీవల 3,800 మందికి పైగా డబ్బు పోగొట్టుకున్నారని, రికార్డు కాని కేసులు మరిన్ని ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. స్కిల్స్‌ ఆధారంగా నడిచే గేమ్స్‌ ద్వారా ఈ గ్యాబ్లింగ్‌ జరుగుతుంటుంది. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక జనాదరణ పొందిన వాటిలో ఆన్‌లైన్‌ జూదం ఒకటి. తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో 1.10 బిలియన్ల మంది అంటే జనాభాలో 79 శాతం మందికి మొబైల్‌ సదుపాయం ఉంటే వారిలో 42 శాతం మందికి ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంది. వీరిలో 92.8 శాతం మంది ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుతున్నారు. అవి, స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, గేమింగ్‌ కన్సోల్, టాబ్లెట్‌లు, హ్యాండ్హెల్డ్‌ డివైస్, మీడియా స్ట్రీమింగ్‌ పరికరాలతో పాటు వర్చువల్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ల ద్వారా జరుగుతుంటుంది.
చట్టబద్ధమేనా!?
పబ్లిక్‌ గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌–1867 ఆధారంగా, భారతదేశంలో అన్నిరకాల జూదం చట్టవిరుద్ధం. అంటే మీకు ఇష్టమైన గేమ్‌ లేదా ప్లేయర్‌ (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండూ)పై పందెం వేయడం చట్టవిరుద్ధం. చట్టబద్ధతను అర్థం చేసుకోవాలంటే.. బెట్టింగ్‌ జరిగే రెండు రకాల గేమ్‌ల గురించి మనం మరింత అర్థం చేసుకోవాలి. 
గేమ్‌ ఆఫ్‌ ఛాన్స్‌ 
ఇవి అదృష్ట ఆధారిత గేమ్‌లు. ఈ రకమైన గేమ్‌లు భారతదేశంలో చట్టవిరుద్ధం. ఈ గేమ్‌ల కోసం పందెం వేయడానికి ముందస్తు జ్ఞానం లేదా అవగాహన అవసరం లేదు. 
నైపుణ్యం గల గేమ్స్‌ 
ఇవి ఎంపిక కంటే విశ్లేషణాత్మక నిర్ణయం తీసుకోవడం, తార్కిక ఆలోచన, సామర్థ్యం అవసరమయ్యే గేమ్‌లు. ఈ రకమైన గేమ్‌లు భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో చట్టబద్ధం.  మిగతా ప్రాంతాల్లో ఇవి చట్టవిరుద్ధం అయినప్పటికీ మోసగాళ్లు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ను నిర్వహించేందుకు మోసపూరితమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ఉదాహరణకు.. (ఎ) కరేబియన్‌ – కురాకై గేమింగ్‌ (బి) మెడిటరేనియన్‌ నుండి మాల్టా గేమింగ్‌ అథారిటీ (సి) యుకె గ్యాంబ్లింగ్‌ కమిషన్‌ నుంచి యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నుండి లైసెన్స్‌లను పొందినవి.

ఇవి ఆయా దేశాలకు మాత్రమే పరిమితం అయి ఉంటాయి. వీటి సమాచారం మనకు కనపడనంత చిన్నగా రాసి ఉంటుంది. సాధారణంగా ఫుటర్‌లో వీటిని లిస్ట్‌ చేసిన దేశాలలో మాత్రమే ప్లే చేయవచ్చని పేర్కొని ఉంటుంది. కానీ, అన్ని దేశాల్లోకి ఈ గేమ్స్‌ ద్వారా మోసగాళ్లు చొరబడటానికి ఆన్‌లైన్‌లో పొంచి ఉంటున్నారు.
మన దేశంలో ..
ప్రస్తుత ట్రెండ్‌లకు సరిపోయే విధంగా చట్టపరంగా సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్‌ (గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌)తో రావడానికి పౌరసంఘాలు, సాంకేతిక సంస్థలు, సైబర్‌ పోలీసులు, సైబర్‌ లాయర్ల నుండి మరిన్ని చర్చలు అవసరం. యాపిల్, గూగుల్‌లో గ్యాంబ్లింగ్‌ యాప్‌లు అనుమతించని జాబితాలో భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు మాత్రమే మినహాయించబడ్డాయి. ఈ యాప్‌లు వెబ్‌సైట్‌ల నుండి (APK,DMZఫైల్‌ల ద్వారా) మాత్రమే డౌన్‌లోడ్‌ అవుతాయి. యాప్‌ స్టోర్‌ లేదా ప్లే స్టోర్‌ నుండి కాదని గుర్తించాలి. గ్యాంబ్లింగ్‌ యాప్స్‌ నిర్వహణ
దశ 01: ముందుగా, మీరు ఒక సూచన ద్వారా ఈ యాప్‌లో చేరుతారు.
దశ 02: మిమ్మల్ని టెలిగ్రామ్‌ గ్రూప్‌లో యాడ్‌ చేస్తారు. యాప్‌ నిర్వాహకులు బ్రిటీష్‌ పేర్లతో ఉన్న మహిళలు, విదేశీ వ్యక్తుల ఫోటోలతో ఉంటాయి. ్ఖఓ ఫోన్‌ నంబర్‌లను ఉపయోగించి వాటిని ఆపరేట్‌ చేస్తారు. 
దశ 03: పందెంలో పాల్గొనబోతున్నందుకు మీరు మీ రోజువారీ లాభంలో 40 శాతం కమీషన్‌గా చెల్లించాలని కోరుతారు.
దశ 04: కమీషన్‌ను బదిలీ చేయకుండా ఉండటానికి సబార్డినేట్‌ అనే కొత్తవ్యక్తిని పరిచయం చేస్తారు.
దశ 05: మీరు యాప్‌లో చేరిన తేదీ నుండి 5 రోజుల తర్వాత ప్రతి రిఫరల్‌ వ్యక్తి రూ.3000 సంపాదించినట్టు చూపుతారు.
దశ 06: ఒకే రోజున 3 రెఫరల్స్‌ ఉన్నట్లయితే, వారు చేరిన 5 రోజుల తర్వాత ఒకరికి రూ.3000 తోపాటు అదనంగా మరో రూ.5000 ఇస్తారు. ఇది ఒక ఎక్కువ మొత్తం కోసం వేసే ఎర అని గుర్తుపెట్టుకోవాలి.
దశ 07: 7–10 రోజుల తర్వాత ఫస్ట్‌æ విత్‌డ్రావల్‌ చేయవచ్చు. అయితే, పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.10,000 పందెం పూర్తయిన తర్వాతే తీసుకోవాలి..
దశ 08: ఒకసారి విత్‌డ్రాకు అర్హత పొందితే, 68 గంటల్లో నగదు మొత్తం మన బ్యాంక్‌ ఖాతాలో జమ చేయబడుతుంది. 
దశ 09: 20–30 రోజులకు ఒకసారి ఎక్కువ మొత్తం జమ అయ్యే రోజు ఉంటుంది, ఇక్కడ బ్యాలెన్స్‌ 10,000 ఖాతాలో అన్ని సమయాల్లో ఉండేలా మనం మరింత డబ్బు చేర్చాలి.
దశ 10: సాధారణంగా రోజుకు రూ. 800. ఎక్కువ వాటాలు ఉన్న రోజున, అది రూ.1500 నుండి రూ.2000 దాటుతుంది. 
దశ 11: మోసగాళ్లు ఎక్కువ లాభాల కోసం పెట్టుబడి పెట్టడానికి ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తారు. ఆపై వారు ఒక రోజులో సూపర్‌ హై షేర్‌ని సృష్టిస్తారు. దీంతో ప్రజలు తగినంత బ్యాలెన్స్‌ లేకపోవడం వల్ల నష్టాలను నివారించడానికి Sరు.50,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి.
దశ 12:  ప్రజలు బ్యాలెన్స్‌లను కొనసాగించగలిగినప్పటికీ, వారు కొత్తగా పెట్టుబడి పెట్టిన మొత్తం పందెంలో పాల్గొననందున వారు ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉండదు.
దశ 13:  చాలా మంది వ్యక్తులు డబ్బును పోగొట్టుకోవడం చూసినప్పుడు, నమ్మకాన్ని పొందడానికి, నష్టాలను తిరిగి పొందేందుకు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టే నష్టపరిహార ప్రణాళికను అందిస్తారు. 
దశ 14: అందరూ నిద్రపోతున్న చోట అర్ధరాత్రి పందెం వేస్తే, అందరూ మేల్కొనే సమయానికి మన ఖాతాలో ఏమీ మిగిలి ఉండదు. చివరి వ్యక్తి మొత్తం డబ్బును పోగొట్టుకునే వరకు పందెం కొనసాగుతుంది. 
దశ 15:  చెల్లింపు/రీఛార్జ్‌ ప్లాట్‌ఫారమ్‌ను క్లోజ్‌ చేస్తారు. విత్‌డ్రాæవిధానం రద్దయ్యి ఉంటుంది. టెలిగ్రామ్‌ గ్రూప్‌ను క్లోజ్‌ చేస్తారు.
చదవండి:Parenting Tips: పంచతంత్రం.. పిల్లల్ని చక్కగా పెంచడం ఎలా? అంటే..

మరిన్ని వార్తలు