TIPS: రోజూ వాడే పాలప్యాకెట్లను పడేస్తున్నారా.. ఇలా వాడుకోవచ్చు

9 Sep, 2022 13:53 IST|Sakshi

పాలు నిల్వచేయడానికి వాడే ప్యాకెట్‌ గట్టిగా ఉంటుంది. అందువల్ల ప్యాకెట్లన్నింటిని వెడల్పుగా కత్తిరించి శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టాలి. బాగా ఆరిన తరువాత ఒకదానితో ఒకటి కలిపి చిన్న చిన్న బుక్స్‌కు అట్టలుగా, ప్యాకింగ్‌ కవర్లుగా వాడుకోవచ్చు. దీనివల్ల నోట్‌బుక్స్, ప్యాకింగ్‌ చేసిన వస్తువులు తడవకుండా ఉంటాయి.

►పాలప్యాకెట్లను గరాటు ఆకారంలో రోల్‌ చేసి ఊడకుండా టేప్‌తో గట్టిగా అతికించాలి. ఈ గరాటులో ఫుడ్‌క్రీమ్, మెహిందీ వేసి నచ్చిన విధంగా డిజైన్లు వేసుకోవచ్చు. ∙ఇంట్లో చాలా పాల ప్యాకెట్లు ఉన్నప్పుడు అన్నింటిని కలిపి మ్యాట్‌లా కుట్టు్టకుని వాడుకోవచ్చు. 

►ప్యాకెట్లతో విసనకర్రలా తయారు చేసి వాడుకుంటే చల్లటి గాలి వస్తుంది.

►కుండీల్లో మొక్కలు పెంచే స్థలం లేనప్పుడు పాలప్యాకెట్లలో మొక్కలను పెంచుకోవచ్చు. ప్యాకెట్స్‌లో కొద్దిగా మట్టి పోసి విత్తనాలు వేసి చిన్నచిన్న మొక్కలు పెంచుకోవచ్చు. 

మరిన్ని వార్తలు