Sujata Seshadrinathan: ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌

2 Feb, 2023 01:02 IST|Sakshi
సుజాత శేషాద్రినాథ్‌న్‌

పవర్‌

సార్క్‌ రీజన్‌ ‘ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారాన్ని స్వీకరించిన సుజాత శేషాద్రినాథ్‌ వ్యాపార అనుభవాలే తన పాఠాలు అని చెబుతుంది...

సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్,అకౌంటింగ్‌ స్పెషలిస్ట్‌గా తనదైన ముద్ర వేసింది సుజాత శేషాద్రినాథన్‌. ఫండ్‌ బిజినెస్‌లో అకౌంటింగ్‌ అప్లికేషన్స్‌ కోసం ఆటోమేటెడ్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ క్రియేట్‌ చేసింది. ‘అద్భుతమైన పురస్కారాన్ని స్వీకరిస్తున్నందుకు గర్వంగా ఉంది. నా ప్రయాణంలో సహకరించిన వ్యక్తులు, సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్న భారతీయ మహిళలకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. శ్రీలంక కేంద్రంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఏర్పాటయిన సంస్థ ఉమెన్స్‌ ఛాంబర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ కామర్స్‌. భవిష్యత్‌తరం మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ఉమెన్స్‌ ఛాంబర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ కామర్స్‌ ఉన్నత ప్రమాణాలు నెలకొల్పింది. ఈ ఉద్యమంలో నేను కూడా భాగం కావడం సంతోషంగా ఉంది’ అంటుంది సుజాత శేషాద్రినాథన్‌.

ఎస్పీజైన్‌ స్కూల్‌ ఆఫ్‌ గ్లోబల్‌ మెనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన సుజాత బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్‌డీ చేసింది. సాఫ్ట్‌వేర్‌ డిజైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ఫండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీసులలో సుజాతకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న బసిజ్‌ ఫండ్‌ సర్వీస్‌ ప్రైవెట్‌ లిమిటెడ్‌కు సుజాత డైరెక్టర్‌. ఫండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ వరకు ఈ సంస్థ ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. రకరకాల విషయాలలో క్లయింట్స్‌కు సంబంధించి జటిలమైన సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుంది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు