తెలుసా?.. ఈ జ్యూస్‌ తాగితే గుండె సంబంధిత వ్యాధులు పరార్‌!

22 Oct, 2021 10:43 IST|Sakshi

మనం రకరకాల పండ్ల రసాలు తాగుతుంటాం. అయితే వాటికన్నా బీట్‌రూట్‌ రసం  తీసుకోవడం చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వారి మాటల్లోనే చెప్పాలంటే...

►బీట్‌రూట్‌లో మనకి కావాల్సిన అనేక పోషకాలున్నాయి. ఐరన్‌ తక్కువగా ఉన్నవారు బీట్‌రూట్‌ జ్యూస్‌ రోజూ తాగితే ఐరన్‌ పెరుగుతుంది. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులు కూడా పెరుగుతాయి. 

►నీరసంతో బాధపడేవారు కొన్ని బీట్‌ రూట్‌ ముక్కలు తిన్నా లేదంటే బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగినా తక్షణ శక్తి వస్తుంది. 

►బీట్‌ రూట్‌లో బి, సి విటమిన్స్‌ అధికం. రక్తపోటు నియంత్రణలో ఉండేందుకు బీట్‌రూట్‌ దోహదం చేస్తుంది. ఇందులో అధికంగా ఉండే కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం అందరికీ అవసరమైనవే.  

చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !!

►తరచూ బీట్‌ రూట్‌ తినేవారికి, రోజూ బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగేవారికి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

►రోజూ బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగితే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది. అలాగే అధిక కొవ్వు సమస్యతో బాధ పడేవారు ఈ జ్యూస్‌ తాగితే కొవ్వు కరుగుతుంది.

►మూడీగా ఉండేవారు అప్పుడప్పుడు బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగుతుంటే ఉల్లాసంగా ఉండగలుగుతారు. 

►గర్భిణులకు కావాల్సిన ఫోలిక్‌ యాసిడ్‌ బీట్‌ రూట్‌ ద్వారా అందుతుంది. గర్భంలోని పిండం సక్రమంగా ఎదగాలంటే గర్భిణీలు రోజూ బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగడం మంచిది. 

►కాలేయాన్ని బీట్‌ రూట్‌ శుభ్రపరుస్తుంది. 

►చర్మ సంబంధిత వ్యాధులు కూడా రావు.  

►ఎముకల్ని గట్టిగా ఉంచే శక్తి కూడా బీట్‌ రూట్‌ కు ఉంటుంది. 

►బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగేవారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడుకు కావాల్సిన రక్త సరఫరా అయ్యేలా బీట్‌ రూట్‌ చేయగలదు. ఏకాగ్రతను పెంచగల శక్తి కూడా బీట్‌ రూట్‌కు ఉంది. అందుకే ఫ్రెష్‌ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగాలి.

చదవండి: Wonder of Science: బాప్‌రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!!

మరిన్ని వార్తలు