Solar Robots: ఎడారుల్లో పచ్చదనం కోసం...

1 May, 2022 13:21 IST|Sakshi

ఎడారుల్లో మొక్కలు పెంచితే ఎంతో బాగుంటుంది కదూ! ఇది సాధ్యమయ్యే పనేనా అనుకుంటున్నారా? అసాధ్యమైన ఈ పనిని సుసాధ్యం చేసేందుకు నడుం బిగించారు దుబాయ్‌ శాస్త్రవేత్తలు. ఎడారుల్లో మొక్కలు నాటడానికి ఏకంగా ఒక రోబోనే తయారు చేశారు. ఈ రోబో ఎడారుల్లో ఎంత దూరమైనా సునాయాసంగా ముందుకు సాగుతూ, విత్తనాలు నాటి, అవి మొలకెత్తి ఏపుగా ఎదిగే వరకు సమస్త బాధ్యతలనూ సక్రమంగా నిర్వర్తిస్తుంది.

దుబాయ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో అక్కడి విద్యార్థులు ఈ రోబోను రూపొందించారు. ఇది పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది. ఎడారులు, బీడభూముల్లో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతోనే దీనిని రూపొందించామని ఈ రోబో రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త మజ్యర్‌ ఇత్తెహాది తెలిపారు. 

మరిన్ని వార్తలు