Dussehra 2022 Sweet Recipes: బాస్మతి బియ్యంతో ఘీ రైస్‌.. కార్న్‌ఫ్లోర్‌తో పనీర్‌ జిలేబీ! తయారీ ఇలా

30 Sep, 2022 12:13 IST|Sakshi
ఘీ రైస్‌, పనీర్‌ జిలేబి

Ghee Rice, Paneer Jalebi Recipes In Telugu: ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారికి  వివిధ రకాల వంటకాలను నైవేద్యాలుగా పెడుతుంటాము. ఈ దసరాకు ఏటా పెట్టే వాటితోపాటు ఎంతో రుచికరమైన ఈ కింది నైవేద్యాలను కూడా అమ్మవారికి సమర్పించి మరింత ప్రసన్నం చేసుకుందాం..

ఘీ రైస్‌
కావలసినవి:
►బాస్మతి బియ్యం – కప్పు
►నెయ్యి – రెండున్నర టేబుల్‌ స్పూన్లు
►బిర్యానీ ఆకు – ఒకటి
►యాలకులు – రెండు
►లవంగాలు – రెండు

►దాల్చిన చెక్క – అంగుళం ముక్క
►అనాస పువ్వు – ఒకటి
►మరాటి మొగ్గ – ఒకటి
►జీలకర్ర – టీస్పూను
►ఉప్పు – రుచికి సరిపడా
►జీడిపప్పు పలుకులు – టేబుల్‌ స్పూను
►పచ్చిబఠాణీ – అరకప్పు
►స్వీట్‌ కార్న్‌ – అరకప్పు
►పచ్చిమిర్చి – మూడు (సన్నగా తరగాలి).

తయారీ:
►స్వీట్‌కార్న్, పచ్చిబఠాణీలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
►స్టవ్‌ మీద బాణలి పెట్టి టేబుల్‌ స్పూను నెయ్యి వేయాలి.
►వేడెక్కిన నెయ్యిలో బాస్మతి బియ్యాన్ని కడిగి వేసి రెండు నిమిషాలు మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. 
►ఇప్పుడు బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాసపువ్వు, మరాటి మొగ్గ, అరటీస్పూను జీలకర్ర వేసి తిప్పాలి.

►దీనిలో ఒకటిన్నర కప్పులు నీళ్లుపోసి అన్నం పొడిపొడిగా వచ్చేలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
►స్టవ్‌ మీద మరో బాణలి పెట్టి ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు నెయ్యి వేయాలి.
►నెయ్యి వేగాక అరటీస్పూను జీలకర్ర, జీడిపప్పు పలుకులువేసి వేయించాలి.
►ఇవి వేగాక తరిగిన పచ్చిమిర్చి, ఉడికించిన పచ్చిబఠాణి, స్వీట్‌ కార్న్‌ వేసి మీడియం మంటమీద వేయించాలి.
►ఇప్పుడు అన్నం వేసి అన్నింటిని చక్కగా కలిసేలా కలియతిప్పి దించేయాలి.
►నెయ్యి, బాస్మతీల సువాసనలతో కాస్త ఘాటుగా, తియ్యగా ఉండే నెయ్యి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు.

పనీర్‌ జిలేబీ
కావలసినవి:
►పనీర్‌ ముక్కలు– అరకప్పు
►మైదా – అరకప్పు
►వంటసోడా – చిటికెడు
►కార్న్‌ఫ్లోర్‌ – టేబుల్‌ స్పూను

►ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌ – పావు టీస్పూను
►పాలు – పావు కప్పు
►నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా
►పిస్తాపలుకులు – గార్నిష్‌కు తగినంత. 

సుగర్‌ సిరప్‌ కోసం:
పంచదార – కప్పు, నీళ్లు – అరకప్పు, కుంకుమపువ్వు రేకలు – ఎనిమిది, నిమ్మరసం – రెండు చుక్కలు, యాలకులపొడి – పావు టీస్పూను.

తయారీ:
►పనీర్‌ ముక్కలను బ్లెండర్‌లో వేసి పేస్టులా గ్రైండ్‌ చేయాలి
►పనీర్‌ పేస్టుని ఒక గిన్నెలో వేయాలి. ఈ గిన్నెలోనే కార్న్‌ఫ్లోర్, వంటసోడా, మైదా, ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌ వేసి కలపాలి. 
►ఇప్పుడు టేబుల్‌ స్పూన్‌ చొప్పున పాలు పోసి కలుపుతూ మెత్తటి పిండి ముద్దలా కలుపుకోవాలి.
►పిండి ఎండిపోకుండా తేమగా ఉండేలా పాలు అవసరాన్ని బట్టి పోసి, కలిపి పక్కన పెట్టుకోవాలి.

►పంచదారను మందపాటి బాణలిలో వేసి నీళ్లు, నిమ్మరసం, కుంకుమ పువ్వు వేసి మీడియం మంటమీద పంచదార తీగపాకం రానివ్వాలి.
►పాకం వచ్చిన వెంటనే యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి.
►కలిపి పెట్టుకున్న పిండిముద్దను మౌల్డ్‌లో వేసుకుని నచ్చిన పరిమాణంలో జిలేబీ ఆకారంలో వేసి డీప్‌ఫ్రై చేసుకోవాలి.
►జిలేబీలు గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారాక తీసి పాకంలో వేయాలి.
►రెండు నిమిషాలు నానాక మరోవైపు తిప్పి మరో రెండు నిమిషాలు నాననిచ్చి పిస్తా పలుకులతో గార్నిష్‌ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి.  

ఈ వంటకాలు ట్రై చేయండి: Papaya Halwa Recipe: మొక్కజొన్న, మైదాపిండితో.. నోరూరించే బొప్పాయి హల్వా! తయారీ ఇలా
Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?!

మరిన్ని వార్తలు