మాంసాహారం తింటున్నారా? ఆ తర్వాత ఇవి తినండి...

17 Mar, 2021 11:30 IST|Sakshi

వాస్తవంగా బాదాం పలుకులను ఎప్పుడైనా తినవచ్చు. అయితే ముఖ్యంగా మనం డిన్నర్‌లో వేటమాంసం, రెడ్‌ మీట్‌ తిన్న తర్వాత కొన్ని బాదాం తినడం మంచిది. ఎందుకంటే ఇవి కొవ్వు అత్యధికంగా ఉండే పదార్థాల వల్ల గుండెకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. ఇక మామూలు సమయాల్లో తిన్నా వీటి వల్ల మనకు ఒనగూరే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో క్యాల్షియమ్‌ పాళ్లు ఎక్కువ. కాబట్టి బాదాంలోని పోషకాలు మన ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

 వైటమిన్‌–ఈ కూడా ఎక్కువే. అందుకే బాదాం గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణాశయానికి మంచి పెరుగు ఎంత మేలు చేస్తుందో, బాదం చేసే మేలూ అంతకు తక్కువేమీ కాదు. శరీరంలో ఎక్కడైనా మంట, వాపులతో ఇన్‌ఫ్లమేషన్‌ ఉంటే కూడా బాదాం తినడం మంచిది. అప్పుడు అందులోని ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్‌ యాసిడ్‌ ఆ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. కొవ్వు పాళ్లు ఒకింత ఎక్కువగా ఉండే మాంసాహారం తర్వాత బాదాంలోని పోషకాలు కొవ్వుల దుష్ప్రభావాన్ని తగ్గించడం వల్ల బాదాం పలుకులు కరోనరీ గుండెజబ్బులనూ సమర్థంగా నివారిస్తాయి.

చదవండి: అంతరిక్షంలో ఆతిథ్యం, ఎప్పటినుంచంటే..‌

ఈ ఫేమస్‌ యాడ్స్‌లో నటించిన సెలబ్రిటీలు వీళ్లే..

>
మరిన్ని వార్తలు