చిలగడదుంప పొట్టుతో సహా తినడం మేలు!

26 Mar, 2021 14:44 IST|Sakshi

సాధారణంగా చిలగడదుంప తినేవారు, దాన్ని ఉడకబెట్టిగానీ లేదా కాల్చిగానీ తింటుంటారు. ఇలా ఉడకబెట్టడం/ కాల్చడం చేశాక తినేటప్పుడు దానిపైన పింక్‌ రంగులో కనిపించే పొట్టును ఒలిచి తింటుంటారు. కానీ చిలగడదుంప పైన ఉండే పొట్టులో కెరటినాయిడ్స్‌ అనే పోషకాలు ఉంటాయి. ఇవి నోరు, ఫ్యారింగ్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడానికి బాగా తోడ్పడతాయి.

వాటితోపాటు ఇందులోనే ఉండే బీటా కెరోటిన్‌ అనే మరో పోషకం ఈసోఫేగల్‌ క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడే జీర్ణవ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి తోడ్పడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నందున ఈ పింక్‌ రంగులో ఉండే పొట్టును ఒలిచిపారేయకుండా తినేయండి.

చదవండి: చక్కనమ్మ బరువు పెరిగినా బ్రహ్మాండమే!

మరిన్ని వార్తలు