ఆ‌ ఆహారంతో నిత్యం సంతోషం..

14 Sep, 2020 20:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రజలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే ఒత్తిడిని ఎదుర్కొవడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. మనం  ప్రోబయోటిక్స్‌ ఆహారం(మంచి బ్యాక్టేరియా) తీసుకుంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండవచ్చు. ప్రోబయోటిక్స్‌ ఆహారం కావాలంటే కొద్దిసేపు పులవడానికి అవకాశమున్న ఇడ్లీపిండి, దోసెపిండి, మజ్జిగ వంటి వాటిల్లో మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియానే మనం ప్రోబయోటిక్స్‌ అని పిలుస్తాం. హార్వర్డ్ విశ్వవిద్యాలయ నిపుణుల ప్రకారం డయెరియా, మలమద్దకం తదితర సమస్యలను ప్రోబయోటిక్స్‌తో ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు.

ప్రోబయోటిక్స్‌తో ఆనందంగా ఎలా ఉండగలం
ఆనందంగా ఉండడానికి ప్రోబయోటిక్స్‌ ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని పోషకాహార నిపుణులు డాక్టర్‌ అనుజా గౌర్‌ తెలిపారు. అయితే ఓ చిన్న ఉదాహరణతో ఆమె విశ్లేషించారు. కాగా డిప్రెషన్‌, మానసిక ఒత్తిడితో బాధపడేవారికి డాక్టర్లు స్వాంతన కలిగించే మందులు సూచిస్తుంటారు. అదేవిధంగా ప్రోబయోటిక్స్‌తో మానసిక సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే ఎక్కువగా పాలు సంబంధించిన పదార్ధాలలో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా లభిస్తుంది.

సానుకూల ఆలోచనలు
మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదని, అలాకాకుండా ఎదైనా సమస్యుంటే కావాల్సిన శక్తి అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి. అయితే ప్రోబయోటిక్స్‌ ఆహారం తీసుకుంటే సానుకూల ఆలోచనలతో పాటు సంతోషంగా ఉండవచ్చు 
 

మరిన్ని వార్తలు