రోజుకి గుప్పెడు పొద్దుతిరుగుడు గింజలు తిన్నారంటే..

14 Oct, 2021 07:42 IST|Sakshi

రోజుకి గుప్పెడు పొద్దుతిరుగుడు గింజలు (సన్‌ ఫ్లవర్‌ విత్తనాలు) తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా అందుతాయి. 
ఈ విత్తనాల్లో ప్రొటిన్‌ , జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ , విటమిన్‌ ఈ, బీ, బీ6, మంచి కొవ్వులు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి.
ఈ గింజల్లోని విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం రక్త పీడనం నియంత్రణలో ఉండడానికి తోడ్పడతాయి.
విటమిన్‌ బి మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ గింజలు డైలీ తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలు కూడా పెరుగుతాయి.
బరువుని అదుపులో ఉంచడం, రోగనిరోధక శక్తిని పెంచి ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరనివ్వదు.
ఇంకా దీనిలో ఉన్న విటమిన్‌ ‘ఈ’ చర్మానికి పోషణ అందించి, హానికర కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. 

చదవండి బ్రేకింగ్‌ రికార్డ్‌.. ఏడడుగుల సౌకుమార్యం

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు