గర్భిణులూ.. చక్కెర తగ్గించండి!

29 Aug, 2021 11:23 IST|Sakshi

చక్కెర పాళ్లు చాలా ఎక్కువగా ఉండి బాగా తీపి పదార్థాలను గర్భవతిగా ఉన్నప్పుడు తినకపోవడమే మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ప్రెగ్నెన్సీలో అలా అపరిమితంగా తీపి పదార్థాలు తినేవాళ్లకు పుట్టిన చిన్నారులకు అలర్జీ, ఆస్తమా వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ అని బ్రిటిష్‌ పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 9000 మంది గర్భిణులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు వారు పేర్కొన్నారు. గర్భవతిగా ఉన్న సమయాల్లో అపరిమితంగా తీపి తినేవారి పిల్లల్లో దుమ్ముకూ, ఇంట్లోని పెంపుడు జంతువుల వెంట్రుకలకూ తీవ్రమైన అలర్జీ వచ్చే అవకాశాలుంటాయని వెల్లడించారు.

కాబోయే తల్లులు ఎంత తక్కువగా స్వీట్లు తింటే పిల్లల్లో ఈ అలర్జీలు అంత తగ్గుతాయని సూచిస్తున్నారు. అయితే ఈ అలర్జీలు.. తీపిని ఇచ్చేందుకు ఉద్దేశించిన కృత్రిమ స్వీటనర్లతోనే అనీ, పండ్లూ, కూరగాయల్లో లభ్యమయ్యే నేచురల్‌ షుగర్స్‌తో ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు. ఈ విషయాలన్నీ ‘యూరోపియన్‌ రెస్పిరేటరీ జర్నల్‌’ అనే వైద్యనిపుణుల సంచికలో ప్రచురితమయ్యాయి.  
చదవండి: భోజనం తర్వాత ప్రతిసారీ టూత్‌పిక్‌ వాడుతున్నారా? 
రెండుసార్లు అబార్షన్‌.. ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో నెగెటివ్‌...పరిష్కారం ఏంటి!

మరిన్ని వార్తలు