జర జాగ్రత్త!.. ఆహారం.. విరామం.. అతి చేస్తే హానికరం

27 Aug, 2021 14:43 IST|Sakshi

తిట్టే నోరే కాదు, అతిగా తినే నోరు కూడా ప్రమాదకరమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే కేవలం ఉపవాసం మంచిదనే ఉద్దేశంతో క్రమపద్ధతి లేకుండా చేసే ఉపవాసాలు ఆరోగ్యం కన్నా చేటు ఎక్కువ కలిగించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యుక్త వయసుకు వచ్చే కొద్దీ ఉపవాసాలు, తినే తిండి తదితర అంశాలపై సరైన అవగాహన లేక చాలామంది అసంబద్ధ ఆహార అలవాట్లు చేసుకుంటారు.

దీంతో వారిలో మానసిక ఒత్తిడి, తమపై తమకు నమ్మకం లేకపొవడం, బలవంతంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, హార్మోన్ల అసమతుల్యత, జన్యువులలో అసంబద్ధ ఉత్పరివర్తనాలు, సమాజంలో కలవలేకపోవడం వంటి దుష్ప్రభావాలు వస్తుంటాయి. అసంబద్ధ ఆహార అలవాట్లు క్రమంగా ఈటింగ్‌ డిజార్డర్లకు దారితీస్తాయి. వీటివల్ల శారీరకంగా కడుపులో మంట, అజీర్తి, కడుపు నొప్పి వంటి జీర్ణవ్యవస్థ సంబంధ సమస్యలతో సతమతమవ్వడం, శరీరానికి తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల చర్మం పొడిబారడం, చేతులు, పాదాల గోళ్లు పెళుసుబారడం, జుట్టురాలిపోవడం వంటివి కనిపిస్తాయి.
చదవండి: ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’.. వధువు వరస మారుతోంది!

స్త్రీలలో ఈటింగ్‌ డిజార్డర్‌ ఉంటే నెలనెల వచ్చే పిరియడ్స్‌ సక్రమంగా రావు. అనోరెక్సియా నెర్వోసా అనే డిజార్డర్‌ కారణంగా ఈ వ్యాధి ఉన్న వారు తగినంతగా ఆహారం తినరు. క్యాలరీలను దృష్టిలో పెట్టుకుని ఆహారాన్ని పూర్తిగా తగ్గిస్తారు. ఫలితంగా వారు బరువు తగ్గిపోతారు. దీంతో వారు చూడడానికి బక్కపలచగా కనిపిస్తారు. బులిమియా నెర్వోసా కారణంగా ఇది ప్రాణానికి హాని కలిగించే రుగ్మత అని చెప్పవచ్చు.
చదవండి: పిల్లలకు ఇవి తినిపించండి... ఆస్తమాకు దూరంగా ఉంచండి

ఈ పరిస్థితి ఉన్న వారు అతిగా తింటారు. తిన్నదానిని అరిగించుకోకుండా వాంతిచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల కడుపులో మంట, చేతుల వెనక క్యాలస్‌ ఏర్పడుతుంది. బింగే ఈటింగ్‌ డిజార్డర్‌ వల్ల అతిగా తిని ఇబ్బంది పడుతుంటారు. అంతేగాక తాము ఆహారపు అలవాట్ల గురించి సిగ్గుపడుతుంటారు. ఈ లక్షణాల్లో ఏ కొన్ని ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. మెడిటేషన్, ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్ల ద్వారా ఈ సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు