English Idioms: ది ఎండ్‌ ఆఫ్‌ ది రెయిన్‌బో

19 Feb, 2022 17:49 IST|Sakshi

మనకు ఒక బలమైన కోరిక లేదా లక్ష్యం ఉండవచ్చు. అయితే దాన్ని నిజం చేసుకోవడం చాలా కష్టం కావచ్చు. ఇలాంటి సందర్భంలో ఉపయోగించే ఇడియమ్‌... ది ఎండ్‌ ఆఫ్‌ ది రెయిన్‌బో.

ఉదా: ఎట్‌ ది మూమెంట్, ఫైండింగ్‌ ఏ గుడ్‌ ప్లంబర్‌ ఈజ్‌ లైక్‌ ఫైండింగ్‌ ఏ పాట్‌ ఆఫ్‌ గోల్డ్‌ ఎట్‌ ది ఎండ్‌ ఆఫ్‌ ది రెయిన్‌బో. ఇక దీని కథ విషయానికి వస్తే...

అనగనగా ఐర్లాండ్‌లో పేద దంపతులు ఉంటారు. ఒకరోజు వీరు పొలంలో పనిచేస్తుండగా ‘లెప్రికాన్‌’ ప్రత్యక్షమౌతాడు. కోటు, హ్యాట్, గెడ్డంతో కనిపించే ఈ వృద్ధుడికి ఇతరులను ఇబ్బందుల్లోకి నెట్టి తమాషా చూడడం అంటే ఇష్టం. ఈ విషయం తెలియక చాలామంది బోల్తా పడుతుంటారు. (నయా ఇంగ్లిష్‌: ఘోస్ట్‌ కిచెన్‌ అంటే?)

‘మీకు ఏంకావాలో కోరుకోండి’ అని ఆ దంపతులను అడుగుతాడు. ఇక అంతే. వెనకా ముందు ఆలోచించకుండా తమలోని దురాశను బయటపెట్టుకుంటారు ఆ దంపతులు. ఖరీదైన బట్టలు, బంగ్లాల నుంచి బంగారుగనుల వరకు అన్నీ కోరుకుంటారు. (క్లిక్‌: క్యాచ్‌–22 సిచ్యువేషన్‌ అంటే ఏంటో తెలుసా?)

‘మీరు కోరినవన్నీ తీరుతాయి. అయితే ఒక విషయం. మీరు ఎప్పుడైతే ఇంద్రధనసు చివర దాగున్న బంగారునాణేల పాత్రను చూస్తారో... అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది’ అని చెప్పి మాయమవుతాడు లెప్రికాన్‌. రెయిన్‌బో చివర ఎప్పుడు కనిపించాలి, అక్కడ బంగారం ఎప్పుడు కనిపించాలి!! (క్లిక్‌: ఉత్త ప్యాంగసియన్‌ ఆశ.. ఇంతకీ ఎవరు ఇతను?)

మరిన్ని వార్తలు