పర్యావరణంలో మీ పాత్ర?

11 Feb, 2023 02:29 IST|Sakshi

పర్యావరణం బాగుంటే మనం బాగుంటాం. మనం బాగుండాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకోసం మీరు ఏమి చేస్తున్నారో మీకు మీరుగా ప్రశ్నలు వేసుకోండి. ఒకవేళ మీకు సరైన సమాధానం రాకపోతే ఈ కింద చెప్పుకున్న పనులు చేసేందుకు ప్రయత్నం చేయండి. 

 ఈ పర్యావరణంలో జంతువులు, పక్షులు కూడా భాగమే కాబట్టి వాటికోసం ఆవాసాలు, చెట్ల మీద గూళ్లు ఏర్పాటు చేయడం.
  జల, మృత్తికా కాలుష్యాలను అరికట్టేందుకు ప్లాస్టిక్‌ సంచుల వినియోగం తగ్గించాలని ప్రచారం చేయడం.
 పాతవస్తువుల పునర్వినియోగం గురించి పిల్లలకు తెలియజేయటం.
  వీధులు,పార్కులు, ఇతర ప్రదేశాల్లో వ్యర్థాలను తీసిపారేయటం.
  వీలైతే పర్యావరణ భద్రత గురించిపాటలు, నాటికలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, వీలైనన్ని మొక్కలను నాటటం, నాటించటం.
  భూమిని, సహజవనరులను కాపాడుకోవటం ఎంతో అవసరం కాబట్టి ప్రతిరోజూ పర్యావరణ దినోత్సవంగానే భావించడం, అలా భావించాల్సిందిగా మన చుట్టుపక్కల వారికి కూడా చెప్పడం.
  మన భూమి భవిష్యత్తు రేపటి పౌరులైన పిల్లల చేతిలో ఉంది కాబట్టి పర్యావరణాన్ని, సహజవనరులను కాపాడాల్సిన బాధ్యతను గురించి వారికి తెలియజేసేందుకుపాఠశాలలో వివిధ రకాల ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి.
  స్వచ్ఛత, కాలుష్యనివారణ, పర్యావరణం తదితర అంశాలకు సంబం
ధించి కృషి చేస్తున్నవారిని, వాటికోసం ఎంతగానోపాటుపడుతున్నవారిని సత్కరించడం వల్ల ఇతరులు సైతం స్ఫూర్తిపొందే అవకాశముంది.
  పర్యావరణ హితం కోసం మన చుట్టుపక్కల చేపడుతున్న, జరుగుతున్న కార్యక్రమాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం. వీటి గురించి మీ మీ చుట్టూ ఉన్నవారు తెలుసుకునేందుకు మీరే సమాచార సారథిగా మారడం. ఇతరులకు ప్రేరణ అందించడం.

మరిన్ని వార్తలు