Health Tips: రక్తం పీల్చే జలగలతో వైద్యం! పైల్స్‌, షుగర్‌ పేషంట్లకు ఉపశమనం.. ఇంకా..

24 Nov, 2022 10:49 IST|Sakshi

Leech Therapy- Health Benefits: లీచ్‌థెరపీ (జలగలతో వైద్యం) కొత్త వైద్యమేమీ కాదు. శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యులు జలగల వైద్యాన్ని వాడుతున్నారు. మనిషికి వచ్చే రకరకాల చర్మ వ్యాధులకు, ఇతర జబ్బులకు చెడురక్తం ప్రధాన కారణం. తేలిగ్గా, తక్కువ ఖర్చుతో, సురక్షితంగా ఈ చెడురక్తాన్ని తొలగించే ప్రక్రియకు వైద్య శాస్త్రంలో జలగల్ని మించిన ప్రత్నామ్నాయం మరొకటి లేదంటారు.  

ఏ ఏ జబ్బులకు వాడతారు? 
లీచ్‌థెరపీతో అన్ని రకాల చర్మవ్యాధులు, రక్తసంబంధిత వ్యాధులన్నిటినీ తగ్గించుకోవచ్చు. సొరియాసిస్, మెటిమలు, మధుమేహం వల్ల వచ్చే పుండ్లు, బోదకాలు, గడ్డలు, పైల్స్... ఇలా చాలా జబ్బులను ఇది నయం చేస్తుంది.  

సొరియాసిస్‌కి...
ఒక వ్యక్తికి ఒంటినిండా సొరియాసిస్. తెల్లటి మచ్చలు రావడం, పొట్టు రాలడం మొదలయింది. పెద్ద మచ్చలున్న ప్రాంతంపై జలగల్ని వదిలారు. అలా ఎనిమిది సిట్టింగ్‌లు వైద్యం చేశారు. మళ్లీ మచ్చలు రాకుండా ఉండేందుకు మందులు ఇచ్చి పంపించారు.

దాంతోపాటు కొన్ని ఆహారనియమాలు కూడా చెప్పారు. ‘సొరియాసిస్‌తో బాధపడేవారు చాలామంది ఉన్నారు. వారికి లీచ్‌థెరపీకి మించిన వైద్యం లేదు. సొరియాసిస్ అనేది చర్మవ్యాధి. శరీరంలో రోగనిరోధక శక్తి లోపించడం వల్ల వచ్చే వ్యాధుల్లో ఇదొకటి.

ఈ వ్యాధిని తగ్గించడం ఒకెత్తు, మచ్చలు పోగొట్టడం ఒకెత్తు. లీచ్ థెరపీ వల్ల ఒంటిపైనున్న మచ్చలన్నీ పోతాయి. అలాగే చెడు రక్తం పోతుంది కాబట్టి కొన్ని ఆహారనియమాలు పాటిస్తే మళ్లీ ఈ జబ్బు వచ్చే అవకాశం ఉండదు’’.

బోదకాలకు
బోదకాలుతో బాధపడేవారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాగా ముదిరిపోతే కష్టం. కానీ మొదటి దశలో లీచ్‌ థెరపీ చేయించుకుంటే చక్కని ఫలితం ఉంటుంది. ‘బోదకాలు వచ్చిన ఆరునెలలలోపు లీచ్‌థెరపీ చేయించుకుంటే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.

బాగా ముదిరిపోయాక ఎనభై శాతం మాత్రమే అవకాశం ఉంటుంది. ముందు నాలుగైదు సిట్టింగ్‌లలో జలగల ద్వారా కాలులో పేరుకుపోయిన చెడు రక్తాన్ని తీసేస్తాం. కాలు లావు తగ్గి మామూలుగా అయిపోతుంది. తరువాత మళ్లీ రాకుండా కొన్ని మందులు ఇస్తాం. వైద్యం సింపులే కాని దీనికి ఒకటీ రెండు జలగలు సరిపోవు. నాలుగైదు ఉండాలి..’’ అంటున్నారు వైద్యులు.

పైల్స్‌ నివారణ...
మల ద్వార ప్రాంతంలో రక్తం గడ్డ కట్టుకు పోయి లేదా పుండుగా ఏర్పడి బాధపెట్టే పైల్స్ నివారణకు కూడా లీచ్‌థెరపీ బాగా ఉపయోగపడుతుంది. గడ్డలు కరగడానికి, పుండు తగ్గడానికి, నొప్పి పోవడానికి... రకరకాల మందులు వాడుతూ ఉంటారు. లీచ్‌థెరపీ వల్ల అన్ని సమస్యలూ ఒకేసారి పోతాయి.

చెడురక్తం, గడ్డకట్టిన రక్తం అన్నీ తొలగిపోతాయి. మూడు సిట్టింగ్‌లు పెట్టించుకుని, కొన్ని రకాల ఆహార నియమాలు పాటిస్తే మళ్లీ ఆ సమస్య మీ జోలికి రాదంటారు ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ప్రకాశ్.

గడ్డలు మాయం...
ఉన్నట్టుండి ఒంటిమీద గడ్డలు ఏర్పడుతుంటాయి కొందరికి. చెడురక్తం, కొవ్వుపదార్థాల వల్ల ఏర్పడ్డ ఈ గడ్డల్ని మందులతో కన్నా...లీచ్‌లతో చాలా తొందరగా కరిగించవచ్చంటారు ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రాగసుధ.

‘చాలామంది ఒంటిపైన గడ్డలు కనిపిస్తాయి. ఎక్కువగా నుదుటి భాగంలో వస్తుంటాయి. మందులకు లొంగని గడ్డల్ని సర్జరీ చేసి తొలగిస్తారు. ఆపరేషన్ లేకుండా లీచ్థెరపీ ద్వారా వీటిని చాలా తేలిగ్గా తొలగించవచ్చు’’ అంటారావిడ.

కంటికి, పంటికి...
లీచ్‌థెరపీని విదేశాల్లో కంటి జబ్బులకు, పంటి జబ్బులకు కూడా వాడుతున్నారు. దీని గురించి ’కంటిలో నీటికాసులు(గ్లకోమా) ఏర్పడుతుంటాయి. దీని వల్ల చూపు మందగిస్తుంది. దీన్నే...కంటికి నీరు పట్టిందని చెబుతుంటారు.

రక్త నాళాల్లో కొవ్వుపదార్థాలు పేరుకుపోవడం, రక్తం గడ్డ కట్టుకుపోవడం వల్ల రక్తప్రసరణ సరిగా జరగదు. దాంతో చూపు మందగిస్తుంది. కంటి చివరి భాగంలో లీచ్‌థెరపీ చేయడం వల్ల రక్తనాణాలలో రక్తప్రసరణ వేగవంతమవుతుంది.

మధుమేహం...
మన దేశంలో లీచ్‌థెరపీ ఎక్కువగా వాడేది మధుమేహం వల్ల వచ్చే పుండ్లకు. షుగర్ ఎక్కువగా ఉన్నవారికి శరీరంలోని కొన్ని భాగాల్లో ముఖ్యంగా కాళ్లకు, చేతులకు చెడు రక్తం పేరుకుపోయి రంగు మారిపోతుంది. దురదగా మొదలైన ఆ ప్రాంతం పుండుగా మారిపోతుంది. ఈ పుండ్లు లీచ్‌థెరపీతో తొందరగా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.

‘నా అనుభవంలో ఎక్కువగా లీచ్‌థెరపీ వాడింది షుగర్ పేషంట్లకే. షుగర్ కంట్రోల్లో లేకపోతే ఆ పుండ్లు తగ్గవు. పుండు తగ్గడానికి ఒకోసారి సర్జరీలు కూడా అవసరమవుతాయి. ప్రతిరోజు డ్రసింగ్ చేయించుకోలేక, పుండు పెట్టే బాధ పడలేక చాలా ఇబ్బందిపడుతుంటారు. పుండు సైజును బట్టి ఎన్ని లీచ్‌లు వాడాలి, ఎన్ని సిట్టింగ్‌లు పెట్టాలో నిర్ణయిస్తాం.

చెడురక్తం, చీము, నీరు, దానివల్ల ఏర్పడ్డ బ్యాక్టీరియా అంతా జలగ తీసేస్తుంది. పుండు మొత్తం మానేవరకూ సిట్టింగ్స్ ఉంటాయి. చాలా తొందరగా ఉపశమనం వస్తుంది.’’ అని చెప్పారాయన. లీచ్‌థెరపీతో షుగర్ పుండు తగ్గించుకున్న షుగర్ కంట్రోల్లో ఉండడం లేదు.

నాలుగు నెలల కిత్రం కుడికాలుకి వాపు వచ్చింది. మెల్లమెల్లగా ఆ ప్రాంతంలో శరీరం రంగు మారడం మొదలయింది. దురద కూడా రావడంతో చిన్నగా పుండు పడింది. వెంటనే ఆసుపత్రికి వెళితే మందులు ఇచ్చారు. అవి వాడుతూ ప్రతిరోజూ డ్రసింగ్ చేయించుకునేవాన్ని.

ఆ నీళ్లు తాగడం వల్ల జలగ పొట్ట పూర్తిగా శుద్ధి అయిపోతుంది. తరువాత దానికి కొన్ని పరీక్షలు నిర్వహిస్తాం. వైద్యానికి అన్ని అర్హతలు పొందిన తర్వాతే దాన్ని థెరపీకి ఎంచుకుంటాం. ఒకరి వైద్యానికి ఉపయోగించిన జలగని మరొకరికి వాడం. లీచ్‌థెరపీ పూర్తవగానే జలగకు ఒక మందు ఇస్తాం. వెంటనే తాగిన రక్తాన్ని వాంతి చేసేసుకుంటుంది.

తరువాత మళ్లీ పసుపు నీళ్లలో వేస్తాం. తరువాత సిట్టింగ్‌నాటికి దాని కడుపులో, శరీరంలో ఎలాంటి చెడుపదార్థాలు లేకుండా శుద్ది చేసి మళ్లీ వైద్యానికి ఉపయోగిస్తాం. పేషెంటు రాగానే నీళ్లలో ఉన్న జలగని తెచ్చి అతనిపై వదిలేస్తాం అనుకుంటే పొరపాటు...ఈ వైద్యానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది’’ అని చెప్పారు రాగసుధ.

అందరినీ పట్టుకోవు...
సాధారణంగా జలగ ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకూ రక్తం పీల్చుకుంటుంది. ఇక చాలు... అనుకుంటే పసుపు కాని ఉప్పు గాని దానిపై వేస్తే వెంటనే వదిలేస్తుంది. తరువాత అది పట్టుకున్న చోట వేడినీళ్లతో కడిగి కొద్దిగా పసుపు అంటించి బ్యాండేజ్ వేసేస్తారు. జలగ పట్టుకోవడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావు. నొప్పి కూడా పెద్దగా ఉండదు.

జలగ రక్తం పీల్చుకుంటున్నప్పుడు ఒకలాంటి మత్తుగా ఉంటుందంటారు పేషెంట్లు. మనవాళ్లు ఈ వైద్యం ప్రయోజనాలు తెలియక ముందుకు రావడం లేదు కాని మా దగ్గరికి వచ్చిన ఏ పేషెంటు కూడా జలగని చూసి భయపడి వెనక్కివెళ్లలేద’’ని చెబుతారామె.

అల్లోపతికి జలగసాయం- జలగల వైద్యం 
ఇంత గొప్పదైనపుడు అల్లోపతి వైద్యంలో కూడా వీటిని వాడుకోవచ్చు కదా! అని జీవరత్నం గారిని ప్రశ్నిస్తే... ‘తప్పకుండా... విదేశాల్లో ఎప్పటినుంచో వాడుతున్నారు. యూరప్ దేశాల్లో ఆపరేషన్ తర్వాత కుట్లు విప్పడానికి జలగల్నే ఉపయోగిస్తున్నారు.

ముఖ్యంగా లావాటి వాళ్లకు కుట్లు విప్పే ముందు రెండు వైపులా రెండేసి జలగల్ని పట్టిస్తే నిమిషాల్లో అక్కడి చర్మం వదులుగా అవుతుంది. అలాగే వాపు, ఇన్ఫెక్షన్లు వంటివి పోతాయి కూడా. దీని వల్ల కుట్లు తేలిగ్గా విప్పడానికి వీలవుతుంది.

హైదరాబాద్‌లోని ఆసుపత్రివారు ప్లాస్టిక్ సర్జరీ అనంతరం స్కిన్ డ్రాఫ్టింగ్‌కి లీచ్ థెరపీ చేయాలని చెప్పి మా దగ్గరికి వచ్చి జలగల్ని తీసుకెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ అనంతరం ఆ భాగంలో రక్తప్రసరణ బాగా జరిగేట్టు చేస్తే తొందరగా చర్మం అతుక్కుంటుంది.

ఇలా పలు సందర్భాల్లో లీచ్‌థెరపీని అల్లోపతివారు కూడా వాడుతున్నారు. అయితే అటు వైద్యుల్లో ఇటు ప్రజల్లో కూడా లీచ్‌థెరపీ గురించి అవగాహన చాలా పెరగాల్సిన అవసరం ఉంది.
-డాక్టర్‌ నవీన్‌ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు

చదవండి: Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్‌.. ఇంకా మెదడు..
5AM Club: వాళ్లంతా ఉదయం ఐదింటికే నిద్రలేస్తారు! ప్రయోజనాలెన్నో!

మరిన్ని వార్తలు