ఫేస్‌బుక్‌ గేమింగ్‌ ఈవెంట్‌ విశేషాలివీ: ఎఫ్‌బి ప్రతినిధి

28 Oct, 2021 18:54 IST|Sakshi

కరోనా కారణంగా పెరిగిన ఆన్‌లైన్‌ యాక్టివిటీలో గేమింగ్‌ కూడా ఒకటి. కరోనా అనంతరం పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు తమ ఆన్‌లైన్‌ వ్యూహాలకు పదనుబెట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ ఏడాదే సరికొత్తగా రూపుదిద్దిన ఆన్‌లైన్‌ క్రీడా కార్యక్రమం ఫేస్‌బుక్‌ గేమింగ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంస్థ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ హట్‌చందానీ సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఆయన పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే...

ఆటకు...ఊపు..
గేమింగ్‌ కమ్యూనిటీకి ఊపునిచ్చేందుకు, ఆటగాళ్లకు మద్ధతుని అందించేందుకు ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మా తొలి గేమింగ్‌ ఈవెంట్‌కి దేశవ్యాప్తంగా గేమ్స్‌ లవర్స్‌ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ వర్చ్యువల్‌ కార్యక్రమంలో ఫేస్‌బుక్‌పై తమ గేమింగ్‌ స్కిల్స్‌ని ఎలా నిర్మించుకోవాలి? ఎలా మెరగుపరచుకోవాలి? తదితర అంశాలపై గేమ్‌ డెవలపర్స్, పబ్లిషర్స్, క్రియేటర్స్‌కు అవగాహన సదస్సులు జరిగాయి. 

మద్ధతు ఇలా...
గేమింగ్‌ క్రియేటర్స్‌కు ఫేస్‌బుక్‌ గేమింగ్‌ క్రియేటర్‌ ప్రోగ్రామ్‌ లెవలప్‌ వంటివాటి ద్వారా మద్ధతు అందిస్తున్నాం. ఫేస్‌బుక్‌ మీద ఎంటర్‌టైనింగ్‌ గేమింగ్‌ వీడియోస్‌ చూడవచ్చు. అలాగే గేమ్‌ టైటిల్స్‌ని, క్రియేటర్స్‌ని ఫాలో చేయవచ్చు. గేమింగ్‌ గ్రూప్స్‌తో అనుసంధానం కావచ్చు. ఇక చిన్నా పెద్దా గేమ్‌ డెవలపర్స్‌ కూడా మా ప్లాట్‌ఫార్మ్‌ ద్వారా తమ గేమ్స్‌కు ఆడియన్స్‌తో పాటే అభివృద్ధిని కూడా అందుకోవచ్చు. 

ఫన్‌ టూ విన్‌...
ల్యూడో కింగ్‌ లాంటి క్యాజువల్‌ టైటిల్స్‌ నుంచీ అస్పాల్ట్‌ 9 లాంటి రేసింగ్‌గేమ్స్‌ దాకా మా ప్లే ప్లాట్‌ఫామ్‌ మీద అందుబాటులో ఉన్నాయి. వీటిని  డౌన్‌లోడ్‌ చేయకుండా నేరుగానే ఆడవచ్చు. ఆడడం మాత్రమే కాదు ఇతరులు ఆడడాన్ని చూడడం కూడా చాలా మంది ఇష్టపడతారు. ఇతర కమ్యూనిటీస్‌తో అనుసంధానం ద్వారా దానికి ఫేస్‌బుక్‌ అవకాశం కల్పిస్తుంది. మేమిస్తున్న మద్ధతు కల్పిస్తున్న అవకాశాల నేపధ్యంలో కేవలం గత జులై, ఆగస్టు నెలల్లోనే దాదాపు 20 మిలియన్ల మంది ఫేస్‌బుక్‌ గేమింగ్‌ గ్రూప్స్‌లో సభ్యులుగా మారారు. 

మరిన్ని వార్తలు