మీకు తెలుసా?

11 Feb, 2023 02:59 IST|Sakshi

మెదడు తనను తాను రిపేర్‌ చేసుకునేందుకు దోహదపడే ప్రక్రియ నిద్ర. తగినంత నిద్రపో వడం వల్ల మనసుకు, శరీరానికి కూడా ప్రశాంతంగా, రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. అయితే కొందరు నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లలు, పెద్దల్లో ఒబేసిటీ ముప్పు పెరుగుతుంది. సరైన నిద్ర లేకుంటే పిల్లల్లో 89 శాతం, పెద్దల్లో 55 శాతం మేర అధిక బరువు పెరిగే ఛాన్సులున్నాయి. ఇంతేకాదు, రకరకాల దుష్ప్రభావాలు 

నిద్రలేమితో జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. 
 దాదాపు 15 పరిశోధనల సారాంశం ప్రకారం సరిగా నిద్రపోని వ్యక్తుల్లో గుండెపోటు, పక్షవాతం ముప్పు 50 శాతం మేర పెరుగుతుంది.
 నిద్రలేమి కారణంగా కార్టిసోల్‌ అనే స్ట్రెస్‌ హార్మోన్‌ అధిక మోతాదులో విడుదల అవుతుంది. ఇది చర్మసంరక్షణకు తోడ్పడే కొల్లాజెన్‌ను విచ్ఛిన్నం చేసి చర్మ సౌందర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది.
 ఒక పరిశోధనలో 6 రాత్రుల ΄ాటు కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయిన వ్యక్తుల రక్తంలో ప్రీడయాబెటిస్‌ లక్షణాలు కనిపించినట్లు తేలింది.
 నొప్పి, దురద, అసౌకర్యం లాంటివి నిద్రలేమితో పెరుగుతాయి. ఐబీఎస్‌ లాంటి వ్యాధుల ముప్పు సరైన నిద్ర లేని వారిలో అధికం.
 కునుకు సరిగా లేనివారిలో క్రోన్స్‌ వ్యాధి వచ్చే ముప్పు రెట్టింపని తేలింది. 
 కాబట్టి, టీనేజర్లైనా, పెద్దవారైనా సమయానుగుణంగా నిదురించకపోతే తర్వాత పశ్చాత్తాప పడాల్సివస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాలని నిపుణుల సూచన.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు