సన్నాఫ్‌ విరాట్‌ కోహ్లీ

25 Feb, 2024 06:18 IST|Sakshi

వైరల్‌

అనుష్క శర్మ ఈ నెల 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అబ్బాయికి ‘అకాయ్‌’ అని పేరు పెట్టినట్లు తెలియజేశాడు విరాట్‌ కోహ్లీ. అయితే ‘అకాయ్‌’ ఫొటోను ఎక్కడా షేర్‌ చేయలేదు. దీంతో ‘అకాయ్‌’ రూ΄ాన్ని రకరకాలుగా ఊహించుకుంటూ అభిమానులు ఏఐ జెనరేటెడ్‌ ఫొటోలను క్రియేట్‌ చేశారు. అకాయ్‌ను విరాట్‌ ఎత్తుకున్నట్లు, విరాట్‌–అనుష్కలు అకాయ్‌తో ఆడుకుంటున్నట్లు... ఇలా రకరకాలుగా క్రియేట్‌ చేశారు.

‘అకాయ్‌ ఫొటో షేర్‌ చేయకుండా విరాట్‌ కోహ్లీ మంచి పని చేశాడు. చేసి ఉంటే ఇంత అద్భుతమైన చిత్రాలను చూసి ఉండేవాళ్లం కాదు’ అంటూ నెటిజనులు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రశంసల వర్షం ఒక కోణం అయితే... సాంకేతిక ఆసక్తి మరో కోణం. ‘మీరు ఉపయోగించిన ఏఐ టూల్స్‌ గురించి వివరంగా తెలుసుకోవాలని ఉంది’ అంటూ చాలామంది కామెంట్స్‌ పెడుతున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు