Fashion- Mouni Roy: ‘డెమె బై గాబ్రియేలా’.. మౌనీ రాయ్‌ కట్టుకున్న ఈ చీర ధరెంతో తెలుసా?

19 Mar, 2022 15:43 IST|Sakshi

స్టార్‌ స్టయిల్‌

మొహంలో అమాయకత్వం.. పోషించే పాత్రలో ఆటిట్యూడ్‌.. ఈ రెండిటినీ ఐడెంటిటీగామలచుకున్న హిందీ నాయిక .. మౌనీ రాయ్‌. దేశమంతా పరిచయం ఉన్న నటి. ఫ్యాషన్‌ ప్రపంచంలో ఆమె గుర్తించే బ్రాండ్స్‌ ఇవే..

ది హౌస్‌ ఆఫ్‌ రోజ్‌
నగల వ్యాపారానికి ఓ గ్రామర్‌ సెట్‌ చేసిన బ్రాండ్‌ ఇది. దీన్ని బీరెన్‌ వైద్య అనే జ్యూయెలరీ డిజైనర్‌ సోదరి పూరిమా సేథ్‌ స్థాపించారు. 1981లో.. ముంబై, ఓపెరా హౌస్‌లోని చిన్న గదిలో మొదలైన ఆ ప్రస్థానం తక్కువ కాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.

వైవిధ్యమైన డిజైన్, నాణ్యతే దీని బ్రాండ్‌ వాల్యూ. ఢిల్లీలోనూ దీనికో స్టోర్‌ ఉంది. లండన్, హాంకాంగ్, ఖతార్, బహెరైన్, దుబాయ్, అబీధాబూల్లో క్రమం తప్పకుండా జ్యూయెలరీ ఎగ్జిబిషన్స్‌ను నిర్వహిస్తూ ఉంటుంది. దీని చరిత్ర ఎంత ఘనమో నగల ధరా అంతే ఘనం. 

జ్యూయెలరీ బ్రాండ్‌:  ది హౌస్‌ ఆఫ్‌ రోజ్‌

డెమె బై గాబ్రియేలా
ఏ అవుట్‌ ఫిట్‌లో ఉన్నా స్టయిల్‌ ఐకాన్‌గా.. వందమందిలో ప్రత్యేకంగా వెలిగిపోతున్నారంటే కచ్చితంగా ఆ ఘనత ‘డెమె బై గాబ్రియేలా’దే అయుంటుంది. ఈ కితాబే ఆ బ్రాండ్‌ వాల్యూ. దీని హక్కుదారు, అధికారి ప్రముఖ మోడల్, నటి గాబ్రియేలా డెమెట్రియాడ్స్‌. దక్షిణ ఆఫ్రికా దేశస్థురాలు. మోడలింగ్‌ అవకాశాలను వెదుక్కుంటూ ముంబై వచ్చింది.

2009లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగమైంది. పేరెన్నికైన ఎన్నో బ్రాండ్లకు మోడలింగ్‌ చేసింది. ఫ్యాషన్‌ పట్ల మక్కువే కాదు.. స్టయిల్‌ పట్ల సెన్స్‌ కూడా ఎక్కువే.  ఆ లక్షణాలే ఆమెను డిజైనింగ్‌ వైపు పురిగొల్పాయి. అలా 2012లో తన పేరు మీదే ‘డెమె బై గాబ్రియేలా’ బ్రాండ్‌ను ప్రారంభించింది. నిజానికి ఇది సెలెబ్రిటీస్‌ బ్రాండ్‌. దీపికా పడుకోణ్, కరీనా కపూర్, అదితీ రావు హైదరీ, మలైకా అరోరా, లీసా హేడన్‌ వీళ్లంతా డెమె బై గాబ్రియేలా అభిమానులే.

ఆధునిక అవుట్‌ఫిట్, సంప్రదాయ కట్టు.. ఏదైనా ..నాజూకు అందం, నిండైన హుందాతనం.. శరీరాకృతి ఎలా ఉన్నా పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్‌ అయ్యేది ఈ బ్రాండే. క్యాజువల్‌ వేర్‌ నుంచి పార్టీ వేర్‌ వరకు అన్ని సందర్భాలకు సరిపోయే దుస్తులూ దొరుకుతాయిక్కడ. డిజైన్‌ను బట్టే ధర. ఆన్‌లైన్‌లో మాత్రమే లభ్యం. 

రోజ్‌ గోల్డ్‌ ప్రీ డ్రేప్డ్‌ శారీ
బ్రాండ్‌: డెమె బై గాబ్రియేలా
ధర:రూ. 22,540

స్టయిల్‌.. ఫ్యాషన్‌ అనేవి వ్యక్తిగతమైనవి. వాటి వ్యక్తిత్వానికి కొనసాగింపుగా భావిస్తాను– మౌనీ రాయ్‌ 
-దీపిక కొండి

మరిన్ని వార్తలు