సెల్ఫ్‌ ఎంపవర్‌మెంట్‌

7 May, 2023 00:53 IST|Sakshi

కోల్‌కతాకు చెందిన దీప్తి ఘోష్‌ ఇంజనీరింగ్‌ చదువుకుంది. తండ్రి చనిపోవడంతో కుటుంబ బరువు బాధ్యతలు తనపై పడ్డాయి. ఉద్యోగాల వేటలో పడింది. అయితే వచ్చిన ఒకటీ రెండు ఉద్యోగాలు ‘ఔట్‌ ఆఫ్‌ కోల్‌కతా’ వచ్చాయి. తల్లి, చెల్లిని విడిచి దూరంగా ఉండలేని పరిస్థితి.

సిటీలో ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో ఏమో అనుకునే పరిస్థితుల్లో ఖాళీగా ఉండడం ఎందుకని క్యాబ్‌ డ్రైవర్‌గా మారింది. మంచి ఆదాయాన్ని అర్జిస్తూ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది. దీప్తి క్యాబ్‌లో ప్రయాణించిన దిల్లీకి చెందిన పరమ్‌ కల్యాణ్‌సింగ్‌ ఆమె స్టోరీని పోస్ట్‌ చేస్తే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

‘సెల్ఫ్‌ ఎంపవర్‌మెంట్‌ అంటే ఇదే’  ‘చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదని బాధపడుతూ కూర్చోవడం కంటే ఇది ఎంత గొప్ప పని!’ ‘దీప్తి తన వృత్తిని గౌరవిస్తుంది. శ్రమజీవుల లక్షణం ఇది. స్త్రీ సాధికారతకు తిరుగులేని ఉదాహరణ దీప్తి’... ఇలాంటి కామెంట్స్‌ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి.

మరిన్ని వార్తలు