బిహారీ ఫిష్‌ కర్రీ.. రుచి మాములుగా ఉండదు

11 Jul, 2021 10:00 IST|Sakshi

కావలసినవి:
రవ్వ చేపముక్కలు–ఆరు; పసుపు–మూడు టేబుల్‌ స్పూన్లు; కారం–రెండు టేబుల్‌ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు–పది; పచ్చిమిరపకాయలు–రెండు; ఆవాలు– టీ స్పూను; మిరియాలు–టీ స్పూను; మెంతులు–టీ స్పూను; జీలకర్ర– టీ స్పూను; టమోటా తరుగు–అరకప్పు; ఆవ నూనె–రెండు టేబుల్‌ స్పూన్లు; బిర్యానీ ఆకులు–రెండు; గరం మసాల–టీ స్పూను; ధనియాలు–రెండు టీ స్పూన్లు; ఎండు మిరపకాయలు–నాలుగు; ఆయిల్‌ –మూడు టేబుల్‌ స్పూన్లు; ఉప్పు రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు–గార్నిష్‌కు సరిపడా.

తయారీ: 
►ముందుగా చేపముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి దానిలో రెండు టీ స్పూన్ల ఉప్పు, పసుపు, కారం, ఆయిల్‌ వేసి బాగా కలిపి పదిహేను నిమిషాలపాటు నానబెట్టాలి
 
►వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిరపకాయలు, పసుపు, టమోటా తరుగు మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్టు చేయాలి 

►స్టవ్‌పై ప్యాన్‌ పెట్టి ఆవనూనె వేసి కాగనివ్వాలి. నూనె కాగాక నానబెట్టిన చేపముక్కలను వేసి ఫ్రై చేసి పక్కన పెట్టాలి 

► చేపముక్కలు వేగిన ప్యాన్‌లో మూడు టేబుల్‌ స్పూన్ల ఆయిల్‌ వేసి కాగాక.. బిర్యానీ ఆకులు వేసి వేగనిచ్చి, తరువాత గ్రైండ్‌ చేసి పెట్టుకున్న మసాల పేస్టు రుచికి సరపడా ఉప్పువేసి వేగనివ్వాలి. ఆయిల్‌ పైకి తేలాక వేయించి పెట్టుకున్న చేపముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి పదినిమిషాలపాటు ఉడికించాలి 

►పదినిమిషాల తరువాత గరం మసాలా వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే బిహారీ ఫిష్‌ కర్రీ రెడీ. వేడివేడి కూర మీద కాస్త కొత్తిమీర తరుగు చల్లి వడ్డిస్తే బిహారీ ఫిష్‌ కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది.

మరిన్ని వార్తలు