పాస్తా అండ్ మోర్
Food Preparation Equipment: పాస్తా, నూడూల్స్ వంటి ఫాస్ట్‌ఫుడ్ రుచులకు పిల్లలే కాదు పెద్దలు కూడా ఫిదా అవుతుంటారు. మరి ఆ రుచులను నిత్యం బయట కొనుక్కుని.. లేనిపోని ఆరోగ్య సమస్యలు తెచ్చుకునేకంటే ఇంటి పట్టునే చేసుకుంటే రుచికి రుచి.. శుచికి శుచి కదా! అందుకే ఈ డివైజ్. కావల్సిన ఇంగ్రీడియన్స్ సిద్ధం చేసుకుంటే చాలు.. మొత్తంగా 8 షేపుల్లో పాస్తా తయారు చేయగలదు.
దీని ముందు భాగంలో (కనిపిస్తున్న విధంగా) మనకు కావల్సిన షేప్‌కి సంబంధించిన వైట్ కలర్ క్యాప్ సెట్ చేసుకుని, మెషిన్ పైభాగంలో అన్ని ఇంగ్రీడియన్స్‌తో పాటు.. గుడ్లు లేదా వెజిటబుల్స్ జ్యూస్ లేదా వాటర్ జోడించి పెట్టుకోవాలి. మనకు ఎగ్ నూడూల్స్ కావాలంటే ఎగ్ జోడించుకోవచ్చు.
లేదంటే వెజిటబుల్ జ్యూస్ లేదా వాటర్ పోసుకోవచ్చు. ఈ మెషిన్ పార్ట్స్‌ని వేరు చేసి క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులభం. దాంతో చాలా ఫ్లేవర్స్‌లో పాస్తా, నూడూల్స్ వంటివి వండుకోవచ్చు. అందుకు సంబంధించిన అన్ని ఆప్షన్స్ డివైజ్ పైభాగంలోని ఒకవైపున ఉంటాయి. దాంతో దీన్ని తేలికగా ఉపయోగించుకోవచ్చు.
ధర: 26 డాలర్లు (రూ.1,990)
చదవండి👉🏾Baby Food Device: బుల్లి బుజ్జాయిల కోసం.. ఈ డివైజ్ ధర 4,947 రూపాయలు