Multi Maker Uses: ఉపయోగించడం తేలిక.. అప్పటికపుడు ఐస్‌క్రీం రెడీ!

13 Sep, 2021 15:39 IST|Sakshi

కొత్తకొత్తగా

హైక్వాలిటీ టెక్నాలజీతో 3 ఇన్‌ 1 రిమూవబుల్‌ నాన్‌–స్టిక్‌ లార్జ్‌ ప్లేట్స్‌ ఉన్న ఈ గ్రిల్‌.. సరికొత్త లగ్జరీ లుక్‌తో వినియోగదారులని ఇట్టే ఆకర్షిస్తోంది. ‘హై, మీడియం, లో’ అనే త్రీ లెవల్స్‌ టెంపరేచర్‌ ఆటోమేటిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ కలిగిన ఈ గాడ్జెట్‌పై.. శాండ్విచ్, వాఫిల్స్, బార్బెక్యూ స్టిక్స్‌.. వంటివెన్నో సిద్ధం చేసుకోవచ్చు. మన్నికైన నాన్‌–స్టిక్‌ పూత పూసిన ఈ ప్లేట్స్‌ తక్కువ నూనెతో కరకరలాడే రుచులని అందిస్తాయి. 

ఎలాంటి పరిస్థితుల్లోనూ మేకర్‌కు ఆహారం అతుక్కోదు. దాంతో మృదువైన  తడి గుడ్డతో క్లీన్‌ చేస్తే సరిపోతుంది. ఈ మేకర్‌ చిన్నపాటి సూట్‌కేస్‌లా ఉంటుంది. వాఫిల్స్, శాండ్విచ్‌లకు 2 జతల ప్లేట్స్, గ్రిల్‌ చేసుకోవడానికి ఒక పొడవాటి ప్లేట్‌.. మొత్తంగా 5 ప్లేట్స్‌ విడివిడిగా లభిస్తాయి. చిత్రంలో చూపించిన విధంగా 180 డిగ్రీల దగ్గర టెంపరేచర్‌ సెట్‌ చేసుకొని దానిపైన గ్రిల్‌ ప్లేట్‌ పెట్టుకుని.. ఆహారాన్ని గ్రిల్‌ చేసుకోవచ్చు. ఆప్షన్స్‌ అన్నీ ముందువైపు వివరంగా ఉండటంతో దీన్ని ఉపయోగించడం చాలా తేలిక.

ఫ్రిక్సెన్‌ ఐస్‌క్రీమ్‌ రోలర్‌ ప్లేట్‌


మెనూలోని డెజర్ట్స్‌ సెక్షన్‌లో సాధారంగా అందరూ ఆత్రంగా వెదికేది.. తప్పకుండా కనిపించేది ఐస్‌క్రీమ్‌. బయటకొంటే.. కరిగేలోపు తినెయ్యాలి. కష్టపడి ఇంట్లో చేసుకుంటే.. గడ్డకట్టే దాకా ఎదురుచూడాలి. అందుకే ఐస్‌క్రీమ్‌ ప్రియుల కోరిక మేరకు.. నచ్చినప్పుడు, నచ్చిన విధంగా నిమిషాల్లో ఐస్‌క్రీమ్‌ రోల్స్‌ తయారుచేసుకుని, ఆనందంగా ఆస్వాదించే అవకాశాన్ని కలిపిస్తోంది ఫ్రిక్సెన్‌ ఐస్‌క్రీమ్‌ రోలర్‌ ప్లేట్‌. దీనికి పవర్‌తో పనిలేదు. ఇది 24 గంటలు ఫ్రిజ్‌లో ఉంటే.. కావాల్సినప్పుడు ఐస్‌క్రీమ్‌ చేతిలో ఉన్నట్టే. అదెలా అనేగా మీ డౌట్‌? ఏం లేదు.. రెసిపీ ముందే రెడీ చేసి పక్కనపెట్టుకుని.. ఫ్రిజ్‌లోంచి ఈ మేకర్‌ బయటికి తీసి.. దాని ప్లేట్లో ఆ మిశ్రమాన్ని పోసి.. పలచగా అంతా పరచాలి. 6 నుంచి 8 నిమిషాల పాటు.. అలానే ఉంచి రోల్స్‌లా తీసి సర్వ్‌ చేసుకోవాలి. లేదంటే అప్పటికప్పుడు మేకర్‌పైనే రెసిపీని సిద్ధం చేసుకోవచ్చు. 

గాడ్జెట్‌తో పాటు..  రెండు గరిటెలు లభిస్తాయి. వాటితోనే మేకర్‌ మీద అరటిపండ్లు, చాక్లెట్స్‌లు ఇలా వేటినైనా మెత్తగా గుజ్జులా చేసుకుని, కస్టర్డ్‌మిల్క్, ఎసెన్స్‌ వంటివి జోడించి టేస్టీగా ఐస్‌క్రీమ్‌ రోల్స్‌లా చేసుకోవచ్చు. పిల్లలు సైతం సులభంగా తయారు చేసుకోవచ్చు. పైగా పూరై్తన తర్వాత ప్లేట్‌ కడిగినట్లు కడిగి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అల్యూమినియం ప్లేట్‌తో రూపొందిన ఈ మేకర్‌ ఎర్గోనామిక్‌ డిజైన్, హై–క్వాలిటీ మెటీరియల్‌తో మార్కెట్‌లో మంచి డిమాండ్‌ పలుకుతోంది. మరో విషయం దీన్ని 24 గంటలూ ఫ్రిజ్‌లో ఉంచడం కుదరకుంటే.. కనీసం 12 గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మేకర్స్‌ దీర్ఘచతురస్రాకారం లో లేదా గుండ్రంగా చాలా రంగుల్లో లభిస్తున్నాయి. క్వాలిటీని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. 

ఫోర్టబుల్‌–ఫోల్డబుల్‌
‘ప్రయాణాల్లో హోటల్‌ ఫుడ్‌ కంటే.. స్వయం పాకాలే బెస్ట్‌..’ అని ఎవరైన సలహా ఇస్తే.. ‘భలే చెప్పొచ్చారు.. కుకర్‌ని మడచి హ్యాండ్‌ బ్యాగ్‌లో పెట్టుకోమంటారా..?’ అని వెటకారమాడకండి. ఎందుకంటే దాన్ని నిజం చేసేసింది టెక్నాలజీ. చిత్రంలోని కుకర్‌ని చక్కగా చిన్న పాటి బాక్స్‌లా మడచి వెంటతీసుకుని వెళ్లొచ్చు. 600ఎమ్‌ఎల్‌ సామర్థ్యం కలిగిన హై–క్వాలిటీ మెటీరియల్‌తో రూపొందిన మినీ ఫోల్డబుల్‌ ఎలక్ట్రిక్‌ హాట్‌ పాట్‌.. చాలా రుచులని నిమిషాల్లో రెడీ చేయగలదు. ఫుడ్‌–గ్రేడ్‌ ఆర్గానిక్‌ సిలికాన్‌తో తయారైన ఫ్లెక్సిబిలిటీ మేకర్‌లో.. వాసన లేకుండా అధిక ఉష్ణోగ్రతపై వంట చేసుకోవచ్చు. దీని 304 స్టెయిన్లెస్‌ స్టీల్‌ బేస్‌ తుప్పు పట్టదు. గాడ్జెట్‌ ముందు భాగంలో సున్నితమైన టచ్‌ కంట్రోల్‌ ప్యానెల్‌పై అన్ని ఆప్షన్స్‌ ఉంటాయి. దాంతో రైస్, నూడూల్స్, సూప్స్, ఎగ్స్, సీఫుడ్‌.. ఇలా చాలానే సిద్ధం చేసుకోవచ్చు.

చదవండి: Attractive Mini Charpoy Trays: నులక మంచం ట్రే, తోపుడి బండి ట్రే.. ఇంకా..

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు