ట్రంప్‌ పంజగుట్టకు ఎందుకొచ్చిండు?

28 Oct, 2020 20:02 IST|Sakshi

కరోనాతోనూ, ఎన్నికల ప్రచారంతోనూ తెగ అలిసిపోయిన అమెరికా ప్రెసిడెంటు డోనాల్డ్‌ ట్రంప్‌కు రిలాక్స్‌ కావాలనిపించింది. సెక్రెట్రీని పిలిచి సలహా అడిగాడు. ‘హైదరాబాద్‌కు వెళ్లండి సార్‌. వరద నీళ్లలో ఫిషింగ్‌  కూడా చేయవచ్చు’ అన్నాడు. మారువేషంలో హైదరాబాద్‌కు వచ్చాడు ట్రంపు. సరదాగా కారులో బయలుదేరాడు. పంజగుట్ట దగ్గర అనుకోకుండా ఒక కారుకు డ్యాష్‌  ఇచ్చాడు. ఆ కారు బాగా దెబ్బతింది. అందులో నుంచి ఒక వ్యక్తి చిరునవ్వుతో బయటికి వచ్చాడు. ట్రంప్‌కు ఆశ్చర్యమేసింది.
‘సారీ... అనుకోకుండా ఇలా జరిగింది. ఇంత జరిగినా మీరు నన్ను తిట్టకుండా చిరునవ్వుతో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఐ లైక్‌ యూ మ్యాన్‌. యువర్‌ గుడ్‌నేమ్‌ ప్లీజ్‌’ అడిగాడు  ట్రంపు.
‘నా పేరు రామ్‌గోపాల్‌వర్మ అండీ. నేను పుట్టి పెరిగిందంతా ఈ పంజగుట్టలోనే. మీరు నా కార్‌కు యాక్సిడెంట్‌ చేయడం అనేది విధిలిఖితం. ఎక్కడో ఉండే మీరు, ఇక్కడే ఉండే నేను కలుసుకోవడం అనేది ఒక అదృష్టం. మనల్ని స్నేహితుల్ని చేయడానికి విధి ఆడిన వింత నాటకం’ కవితాత్మకంగా చెప్పుకుంటూ పోతున్నాడు వర్మ.
‘మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. గూగుల్‌లో కొట్టి చూస్తాను’ అని ల్యాప్‌టాప్‌ తెరిచాడు ట్రంపు.
‘అక్కర్లేదండీ. నేనే మీ రుణం తీర్చుకుంటాను. నా కారులో 75 సంవత్సరాల వోడ్కా ఉంది. తాగుతారా? మీరు తాగడం వల్ల మన ఫ్రెండ్‌షిప్‌ బాగా బలపడుతుంది’ అన్నాడు వర్మ.
‘ఈ వయసులో ఏంతాగుతామండీ’ అంటూనే ఆవురావురుమంటూ ఫుల్‌బాటిల్‌ లాగించాడు ట్రంపు. ఆ తరువాత...
ట్రంపు: ఎవరికో ఫోన్‌ చేస్తున్నట్లున్నారు?
వర్మ: పోలీసులకు...
ట్రంపు: ఎందుకు?!
వర్మ: బాగా తాగి నా కారును ఢీ కొట్టాడని నీ మీద కేసు ఫైల్‌ చేయడానికి....
ట్రంపు: ???? ! !! !!!! ??? 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు