ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ.. ఎక్కడంటే..

2 Oct, 2021 14:06 IST|Sakshi

మహాత్మాగాంధీ 152 వ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఖద్దర్‌ జాతీయ పతాకాన్ని లడఖ్‌లోని లెహ్‌ టౌన్‌లో ఆవిష్కరించారు. కాగా లడఖ్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఆర్‌కే బథుర్‌ శనివారం ఉదయం ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ఆర్మీ ఛీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవనె కూడా హాజరయ్యారు. 

 225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు కొలతతో  ఖద్దర్‌ జాతీయ పతాకాన్ని రూపొందించారు. దాదాపుగా వెయ్యి కిలోల బరువున్న ఈ త్రివర్ణ పతాకాన్ని ఇండియన్‌ ఆర్మీకి చెందిన 57 మంది ఇంజనీర్‌ సైనిక దళం తయారుచేసింది.

కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవియా దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. కొండపై ప్రదర్శనకు ఉంచిన జెండా, కొండ మీదుగా వెళ్తున్న హెలికాప్టర్లు ఈ వీడియోలో కనిపిస్తాయి. ‘గాంధీజయంతి సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జాతీయ పతాకాన్ని లడఖ్‌లో ఆవిష్కరించడం దేశానికే గర్వకారణం. బాపు జ్ఞాపకార్థానికి, హస్తకళలను ప్రోత్సహించడానికి, దేశ గౌరవానికి ఇదే నా వందనం. జై హింద్‌. జై భారత్‌!’ అని  ట్విటర్‌ పోస్టులో పంచుకున్నారు.

చదవండి: ఇవి తింటే బట్టతల ఖాయం..! గుడ్డు తెల్లసొన, చేప, చక్కెర..

మరిన్ని వార్తలు