సేమియా పాయసం తెలుసు కానీ..సేమియా లడ్డు గురించి మీకు తెలుసా?

15 Sep, 2023 13:30 IST|Sakshi

ఈసారి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లు, ఇతర నైవేద్యాలతో పాటు... వైవిధ్యభరితమైన మరెన్నో స్వీట్లను తినిపించి ప్రసన్నం చేసుకుందాం....

సేమియా లడ్డు తయారీకి కావల్సినవి: 

కావలసినవి: వేయించిన సేమియా – కప్పు; కోవా – అరకప్పు;
పంచదార – ఐదు టేబుల్‌ స్పూన్లు; రోజ్‌వాటర్‌ – టీస్పూను; బాదం పలుకులు – మూడు టేబుల్‌ స్పూన్లు.

తయారీ విధానమిలా:
►బాణలిలో పంచదార వేసి సన్నని మంటమీద కరగనివ్వాలి.
► పంచదార కరుగుతున్నప్పుడే కోవా వేసి తిప్పాలి ∙పంచదార కరిగి మిశ్రమం దగ్గర పడినప్పుడు సేమియా, బాదం పలుకులు వేసి కలపాలి.
► అన్ని చక్కగా కలిసిన తరువాత రోజ్‌వాటర్‌ వేసి మరోసారి కలిపి స్టవ్‌ మీద నుంచి దించేయాలి ∙ఇప్పుడు మిశ్రమాన్ని లడ్డుల్లా చుట్టుకుంటే వర్మిసెల్లి లడ్డు రెడీ. 

మరిన్ని వార్తలు