మరో బిజినెస్‌లోకి గౌరీ ఖాన్‌ : గ్రాండ్‌ లాంచింగ్‌, స్టార్ల సందడి

14 Feb, 2024 12:23 IST|Sakshi

ప్రముఖ ఇంటీరీయర్‌ డిజైనర్‌, బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌  భార్య  గౌరీఖాన్‌ కొత్త బిజినెస్‌ షురూ చేశారు.  ముంబైలోని  తొలి రెస్టారెంట్ ‘టోరీ’ ని మంగళవారం రాత్రి ఘనంగా లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా  గౌరీ ఖాన్ స్నేహితులు, ఇండస్ట్రీ ప్రముఖులు, ఇంటీరియర్, ఫ్యాషన్ డిజైనర్లు ఈ వేడుకలో సందడి చేశారు. 

నిర్మాత కరణ్ జోహార్, భావనా పాండే, నటులు సంజయ్ కపూర్, మహీప్ కపూర్, చుంకీ పాండే, నీలం కొఠారి,సీమా సజ్దేహ్  తదితరులు  మెరిసారు. ముఖ్యంగా సుస్సానే ఖాన్ తన ప్రియుడు, నటుడు అర్స్లాన్ గోనితో కలిసి లాంచ్‌కి హాజరై స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 

కాగాఇంటీరీయర్‌ డిజైనర్‌గా వ్యాపార రంగంలో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తూ, అనేక మంది సెలబ్రిటీల ఫ్యావరెట్‌గా మారిపోయింది  గౌరీ ఖాన్‌. అలాగే రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై వరుసగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గౌరీఖాన్‌. ఇపుడికముంబైలోని విలాసవంతమైన ఏరియాలో లగ్జరీ హెటెల్‌తో హాస్పిటాలిటీ రంగంలో  కూడా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega