మనవరాలితో అదానీ మురిపెం : బిలియనీర్‌ ఫోటో వైరల్‌ 

2 Apr, 2024 17:01 IST|Sakshi

అసలు కంటే వడ్డీ ముద్దు అనేది నానుడి. అంటే బిడ్డలతో పోలిస్తే మనవలు మనవరాళ్లపైనే తల్లితం‍డ్రులకు ఎక్కువ​ప్రేమ అభిమానం ఉంటుంది అని.  చాలా సందర్బాల్లో ఇది అక్షరాలా అనిపిస్తుంది. ఇందులో  బడా పారిశ్రామికవేత్తలైనా, సెలబ్రిటీలైనా ఎవ్వరూ అతీతులు కారు.

తాజాగా బిలియనీర్‌, అదానీ గ్రూపు అధినేత గౌతమ్‌ అదానీ తన ముద్దుల మనవరాలిని చూసి తెగమురిసిపోతున్నారు. నీ కళ్లలోని మెరుపుతో పోలిస్తే ఈ ప్రపంచంలోని సంపద అంతా  దిగ దుడుపే అన్నట్టు రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట  వైరలవుతోంది.

14 నెలల మనవరాలు కావేరిని  ఎత్తుకున్న ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు.  ప్రపంచంలో ఇంతకుమించిన సంపద ఏముందంటూ ఒక కవితా పదాలను రాయడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం   ఇంటర్నెట్‌లో  హాట్‌టాపిక్‌గా నిలిచింది.

"ఇన్ ఆంఖోన్ కీ చమక్ కే ఆగే దునియా కీ సారీ దౌలత్ ఫీకీ హై. (నీ కళ్ల మెరుపులో ప్రపంచంలోని సంపద అంతా  మసకబారుతుంది)" అంటూ ఉద్వేగంతో రాసుకొచ్చారు. గౌతమ్ అదానీ- ప్రీతి అదానీ దంపతులకు ఇద్దరు కుమారులు కరణ్, జీత్. వీరిలో పెద్ద కుమారుడు కరణ్- పరిధి ముద్దుల తనయ కావేరి. 

కాగా లండన్‌లోనే సైన్స్ మ్యూజియంలో న్యూ అదానీ గ్రీన్ ఎనర్జీ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ చిన్నారితో ఫోటో తీసుకున్నారు. తన జీవితంలో మనవరాళ్లతో గడపడమే తనకు  పని ఒత్తిడి (బిగ్గెస్ట్‌ స్ట్రెస్‌  రిలీవర్స్‌) పెద్ద ఉపశమనం అని గతంలో  పేర్కొన్నారు. 

"నా మనుమరాళ్లతో సమయం గడపడం చాలా ఇష్టం, వారు నా ఒత్తిడిని తగ్గిస్తారు. నాకు రెండు ప్రపంచాలు  ఒకటి ఉద్యోగం, రెండోది. కుటుంబం, కుటుంబమే  నాకు గొప్ప శక్తి’’ గౌతమ్‌ అదానీ. 

Election 2024

మరిన్ని వార్తలు