మూడే నిమిషాల్లో వేడి వేడి పిజ్జా: పిజ్జా ఏటీఎం, ఎక్కడో తెలుసా?

10 Feb, 2024 11:18 IST|Sakshi

 పిజ్జా ప్రియులకు గుడ్‌ న్యూస్‌: దేశంలోనే తొలి  పిజ్జా ఏటీఎం

మూడు నిమిషాల్లో వేడి వేడిగా.. మీ ముందు

టేస్ట్‌ అండ్‌ టెక్నాలజీ

సాధారణంగా నగదు లావాదేవీలకుపయోగించే ఏటీఎంలతోపాటూ గతంలో గోల్డ్‌ ఏటీఎంను కూడా చూశాం. తాజాగా పిజ్జా ఏటీఎం కూడా వచ్చేసింది. కేవలం మూడే మూడు  నిమిషాల్లో  వేడి  వేడి పిజ్జా మనకందించే  ఏటీఎం.  ఈ పేరు వింటుంటేనే.. మీచుట్టూ పిజ్జా అరోమా నిండిపోయి, నోరూరుతోంది కదా?  మరి ఎక్కడ? ఏంటి? ఎలా?  ఈ వివరాలు కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

ఉత్తర భారతదేశంలో  మొట్టమొదటి స్పీడీ పిజ్జా మెషిన్ ఇది.  చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సు  సమీపంలో ఇది   కొలువు దీరింది. యమ్మీ యమ్మీ పిజ్జా కేవలం 3 నిమిషాల్లో డెలివరీ అవుతుంది. చక్కటి ప్రకృతి అందాలకే కాదు రుచికరమైన పిజ్జా కేంద్రంగా   ఇపుడు సుఖ్నా సరస్సు నిలుస్తోంది. పర్యాటకులకు హాట్‌స్పాట్‌గా ఉన్న సుఖ్నా సరస్సు వివిధ వంటకాలకు పాపులర్‌. ఇపుడిక పిజ్జా వెండింగ్ మెషీన్‌ మరింత ఎట్రాక్షన్‌ అని చండీగఢ్ ఇండస్ట్రియల్ అండ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.  (మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్‌!)

ఈ ప్రత్యేకమైన ఆలోచన  ఫ్రాన్స్‌ ప్రేరణగా వచ్చిందని ఐమ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లైసెన్స్ పొందిన డాక్టర్ రోహిత్ శర్మ వెల్లడించారు.  తమ మొహాలీ ఆధారిత ఫ్యాక్టరీలో యంత్రాన్నితయారు చేయాలని నిర్ణయించుకున్నారట. గత నెలలో దీన్ని ఇన్‌స్టాలేషన్  చేసినప్పటినుంచీ విపరీతమైన ప్రజాదరణ పొందిందన్నారు ఆయన. ప్రస్తుతం  రోజుకు సగటున 100 దాకా ఆల్ వెజిటేరియన్  పిజ్జాలను  సిద్ధం చేస్తోంది. వారాంతాల్లో, ఈ సంఖ్య 200-300 మధ్య ఏదైనా పెరుగుతుంది. ఇది  కేవలం మొట్టమొదటిది, కొత్తదనంతో కూడుకున్నది మాత్రమే కాదని, డొమినోస్,  పిజ్జా హట్   లాంటి వాటితో పోలిస్తే  దాదాపు 35శాతం తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. త్వరలోనే మరిన్ని ప్రధాన నగరాల్లో దీన్ని ఇన్‌స్టాల్‌ చేస్తామని చెప్పారు. దీంతో  పిజ్జా ప్రియులందరికీ ఇది వీకెండ్‌ డెస్టినేషన్‌గా మారిపోనుంది. 

Pearl Kapur మూడు నెలల్లోనే రూ. 9800 కోట్లు : ఎలా బ్రో..?!

మెషిన్‌లోకిఎంట్రీ ఇచ్చి తమకిష్టమైన పిజ్జాను  నమోదు  చేయగానే  ఒక రోబోటిక్ చేయి అవసరమైన టాపింగ్‌తో పిజ్జా బేస్‌ని ఎంచుకొని, దానిని కాల్చి, కేవలం మూడు నిమిషాల్లో సర్వ్ చేస్తుందట. అంతేకాదు  ఏకకాలంలో టాపింగ్స్‌తో ఏడు పిజ్జా బేస్‌లను సిద్ధం చేసే సామర్థ్యం దీని సొంతం. iMatrix వరల్డ్ వైడ్ గతంలో ముంబై రైల్వే స్టేషన్‌లో ఇలాంటి  ఏటీఎంను లాంచ్‌ చేసింది.  కానీ కోవిడ్ ప్రభావం కారణంగా మూసివేయాల్సి వచ్చింది. 
 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega