నెటిజెన్స్ గూగుల్ లో ఎక్కువ సెర్చ్‌ చేసిన కేటగిరీలు ఇవే!

27 Jun, 2021 14:48 IST|Sakshi

నియర్‌ మి
ఫుడ్‌ షెల్టర్‌ నియర్‌ మి, కోవిడ్‌ టెస్ట్‌ నియర్‌ మి, లిక్కర్‌ షాప్స్‌ నియర్‌ మి, నైట్‌ షెల్టర్‌ నియర్‌ మి, గ్రాసరీ స్టోర్స్‌ నియర్‌ మి, జిమ్‌ ఎక్విప్‌మెంట్‌ నియర్‌ మి, బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్‌ నియర్‌ మి, లాప్‌టాప్‌ షాప్‌ నియర్‌ మి, ఫర్నీచర్‌ స్టోర్‌ నియర్‌ మి.. మొదలైన అవసరాల గురించి ఆరా తీసారు.  

హౌ టు 
హౌ టు మేక్‌ పనీర్, హౌటు ఇంక్రీజ్‌ ఇమ్యూనిటీ, హౌ టు మేక్‌ డల్గోనా కాఫీ, హౌ టు లింక్‌ పాన్‌ విత్‌ ఆధార్, హౌ టు మేక్‌ శానిటైజర్‌ ఎట్‌ హోం, హౌ టు రీచార్జ్‌ ఫాస్టాగ్, హౌ టు ప్రివెంట్‌ కరోనా వైరస్, హౌ టు అప్లై ఈ–పాస్, హౌ టు మేక్‌ జిలేబీ, హౌ టు మేక్‌  కేక్‌ ఎట్‌ హోం వంటివాటితోపాటు..హౌ టు బీ యాంటీ రేసిస్ట్‌? కూడా ఉంది. పోయిన ఏడాది జూన్‌ వరకు ‘మిలియనీర్‌ కావడం ఎలా? అనే ప్రశ్నను సంధించిన నెటిజన్లు.. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ను పోలీసులు చంపడంతో ‘హౌ టు బీ యాంటీ రేసిస్ట్‌’ సెర్చ్‌ దాన్ని ఆక్రమించేసింది. ఆ  సంఘటన చాలా దేశాల్లో ప్రభావం చూపింది. దీంతో రేసిస్ట్‌ అంటే ఏంటీ? యాంటీ రేసిస్ట్‌ ఎలా ఉండాలి అనే అన్వేషణ గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌కి చేరింది. ఇదేగాక సిస్టమిక్‌ రేసిజం గురించి కూడా జల్లెడ పట్టారు జనులు.

హౌ టు ఎస్టాబ్లిష్‌ బిజినెస్‌
కరోనా ఎన్నో రకాల కొలువులను ఫైర్‌ చేసింది. దాంతో ఆ నిరుద్యోగులంతా బిజినెస్‌ వైపు దృష్టి మళ్లించారు. ఈ క్రమంలో తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు ఏంటీ? ఏ బిజినెస్‌ అయితే బావుంటుంది? వంటి ఐడియాల కోసం ఆత్రపడ్డారు.

వాట్‌ ఈజ్‌ దిస్‌..
వాట్‌ ఈజ్‌ కరోనా వైరస్, వాట్‌ ఈజ్‌ బినోద్‌లను అధికంగా సెర్చ్‌ చేశారు. గత ఏడాది ఆగస్టు నుంచి చాలామంది హాష్‌ ట్యాగ్‌ బినోద్‌తో మీమ్స్‌ను షేర్‌ చేసారు. వీటి తరువాత వాట్‌ ఈజ్‌ ప్లాస్మా థెరపీ, వాట్‌ ఈజ్‌ సీఏఏలు ఉన్నాయి. గతేడాది ప్రారంభంలో  సిటిజన్‌ షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సీఏఏ) గురించీ  పెద్దసంఖ్యలో వెదికారు. సూర్యగ్రహణం నేపథ్యంలో  ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’కు సంబంధించి మరింత తెలుసుకునే ఆరాటం చూపారు. అసోంలో ఎన్‌ఆర్‌సీ  (ది నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌) అమలు చేస్తున్నట్లు ప్రకటించేటప్పటికి ఉత్తర భారత దేశంలోని రాష్ట్రాలు ఎన్‌ఆర్‌సీ గురించి తెలుసుకునే ప్రయత్నమూ చేశాయి. 

వాట్‌ ఈజ్‌ హంటా వైరస్‌
కరోనా వల్ల చైనా అంటేనే హడలిపోతున్న ప్రపంచాన్ని అక్కడి  ‘హంటా వైరస్‌’ ఉనికి భయంతో  చంపేసేలా చేస్తోంది. హంటా గురించి విన్న ప్రజలు  అమ్మో ఇది కూడా కరోనాలా వ్యాపిస్తుందేమోనని ముందు జాగ్రత్తగా దాని మీద శోధన స్టార్ట్‌ చేశారు..  హంటా వైరస్‌ అంటే ఏంటీ? అది ఎలా వ్యాపిస్తుంది? అంటూ. 

మొబైల్‌ గేమింగ్‌..
లాక్‌డౌన్‌ ప్రారంభమయ్యాక  45 శాతం మంది భారతీయులు మొబైల్‌ గేమ్స్‌లో  మునిగిపోయారు. వాళ్లంతా గేమ్స్‌తోనే  కాలక్షేపం చేసినట్లు ఇన్‌మొబి యాడ్‌టెక్‌ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఏకధాటిగా కనీసం గంట పాటు ఒక దగ్గరే కూర్చుని గేమ్‌లు ఆడినట్లు సర్వే తెలిపింది. ఇదీ కరోనా కాలంలో చిగురించిన ఆసక్తులు,ఆన్‌లైన్‌లో పెరిగిన అన్వేషణలు, జరిగిన కాలక్షేపాలు, తెలుసుకున్న విషయాలు, వివరాల చిట్టా! 

వీళ్లే టాప్‌
అమెరికా ఎన్నికల నేపథ్యంలో జో బైడెన్, 2018లో ఓ ఆత్మహత్య కేసులో అర్ణబ్‌ గోస్వామి అరెస్టు అవ్వడంతో అతని గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది సెర్చ్‌ చేశారు. ఆ  తరువాత స్థానంలో  కనికా కపూర్, కిమ్‌ జాంగ్‌– ఉన్, అమితాబ్‌ బచ్చన్, రషీద్‌ ఖాన్, రియా చక్రవర్తి, కమలా హ్యారిస్, అంకితా లోఖాండే, కంగనా రనౌత్‌ల అప్‌డేట్స్‌ వివరాల అన్వేషణా ఉంది. 

వాట్‌ ఈజ్‌ ఫార్మర్‌ బిల్‌ 2020
భారత ప్రభుత్వం రైతుల అభ్యున్నతికోసం కొత్త వ్యవసాయ చట్టాలను ప్రవేశ పెట్టడం.. వాటిని హర్యాణా, పంజాబ్‌ రైతులు తీవ్రంగా వ్యతిరేకించడం, అంతేగాక దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, అనేక రాజకీయ పార్టీలు ఈ చట్టాలను వ్యతిరేకించడంతో కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏముందో తెలుసుకునేందుకు సెర్చ్‌ చేశారు. సెప్టెంబర్‌ నెల మధ్యకాలంలో అరవై వేలకుపైగా నెటిజన్లు ‘వాట్‌ ఈజ్‌ ఫార్మర్‌ బిల్‌ 2020’ ఇన్‌ ఇండియా పేరుతో వెతికారు.

చదవండి: అమేజింగ్‌ బేబీ మల్టీ ఫంక్షన్‌ కుకర్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు