అడవి బిడ్డల వెతల గాథ.. ‘ఈతచెట్టు దేవుడు’

19 Jun, 2022 16:02 IST|Sakshi

ఒడిశా రాష్ట్రంలో వెనుకబడిన కొరాపుట్‌ జిల్లా– అక్కడి కొండకోనల్లో బతుకులు వెళ్లమార్చే అడవిబిడ్డల వెతల గాథ ‘ఈతచెట్టు దేవుడు’. సుప్రసిద్ధ ఒడియా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గోపీనాథ్‌ మహంతి రాసిన ‘దాది బుఢా’ నవలను డాక్టర్‌ తుర్లపాటి రాజేశ్వరి ‘ఈతచెట్టు దేవుడు’గా తెలుగులోకి అనువదించారు. ఇదివరకే ఈ నవల ‘ది ఏన్సెస్టర్‌’ పేరిట ఇంగ్లిష్‌లోకి అనువదితమైంది. 

ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ అధికారిగా కొరాపుట్‌ జిల్లాలో కొంతకాలం పనిచేసిన గోపీనాథ్‌ మహంతి అక్కడి ఆదివాసీల జీవితాలను దగ్గరగా గమనించారు. లుల్లా అనే గ్రామంలోని గిరిజనుల బతుకులను, వాళ్ల వెతలను కళ్లకు కట్టే గాథ ఇది. లుల్లా గ్రామాన్ని అక్కడి గిరిజనులు విడిచిపెట్టి, మరో గ్రామాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు పాఠకులను కదిలిస్తాయి.

ఒడియా భాషా సాహిత్యాలతో సుదీర్ఘ పరిచయం గల రచయిత్రి డాక్టర్‌ తుర్లపాటి రాజేశ్వరి ఈ నవలను మూలంలోని ఒరవడిని ఒడిసి పట్టుకుని అనువదించిన తీరు ప్రశంసనీయం. నవలలోని గిరిజనుల సంభాషణలకు ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లోని కళింగసీమ మాండలికాన్ని ఎంచుకోవడం సముచితం.
– దాసు 

మరిన్ని వార్తలు