ఎంత ఎమర్జెన్సీ అయితే మాత్రం ఇదేమిటి తమ్ముడూ!

18 Feb, 2024 06:38 IST|Sakshi

వైరల్‌

అమీర్‌ఖాన్, మాధవన్, శర్మన్‌ జోషిల ‘త్రీ ఇడియెట్స్‌’ సినిమాలోని సన్నివేశాలను ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటాం. అందులో ఒకటి హాస్పిటల్‌ సీన్‌. అనారోగ్యంతో బాధపడుతున్న శర్మన్‌ తండ్రిని అమీర్‌ఖాన్‌ స్కూటర్‌పై కూర్చోబెట్టుకొని, భుజాలకు కట్టేసుకొని ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకువెళ్లే సీన్‌ ఉంది.

మధ్యప్రదేశ్‌లోని ఒక హాస్పిటల్‌లో అచ్చం ఇలాంటి సీనే కనిపించింది. అపస్మారకస్థితిలో ఉన్న తన తాతను బైక్‌పై కూర్చోపెట్టుకొని ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకువెళ్లాడు ఒక వ్యక్తి. సదరు ఈ వ్యక్తి ఇదే ఆస్పత్రిలో పనిచేస్తాడట. ‘ఎక్స్‌’లో ఒక యూజర్‌ షేర్‌ చేసిన ఈ వీడియో వైరల్‌ అయింది. ‘త్రీఇడియెట్స్‌’ సినిమా సీన్‌ను గుర్తు తెస్తుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు