ఆకాశ వీధిలో.. బామ్మ ఫిట్‌నెస్‌ మంత్ర

10 Oct, 2020 08:43 IST|Sakshi

ఐదంతస్తుల భవనం మీద నుంచి కిందకు చూస్తేనే కళ్లు తిరుగుతాయి చాలా మందికి. కానీ, 90 ఏళ్ల ప్యాట్రిసియా బేకర్‌ మాత్రం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి 15,000 అడుగుల ఎత్తు నుండి స్కైడైవింగ్‌ చేసింది. అలా వచ్చిన డబ్బును తన మనవడు నిర్మించే ‘స్పెషల్‌ నీడ్‌ పిల్లల’ స్కూల్‌కి, మరోటి అనాథలు ఉండే హోమ్‌కి విరాళంగా ఇవ్వడానికి కేటాయించింది. 90 ఏళ్ల వయసులో చేసిన ఈ సాహసం ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. 

ఈ బామ్మ చెబుతున్న ఫిట్‌నెస్‌ వివరాలు ఈ తరం తప్పక పాటించేవిగా ఉన్నాయి. తన ఫిట్‌నెస్‌ మంత్ర ప్రతి రోజూ ఉదయం 50 సిట్‌అప్స్‌ చేయడంతో ప్రారంభం అవడమే అంటోంది. స్కైడైవింగ్‌ అంటే యువత కూడా భయభ్రాంతులకు లోనవుతారు. అలాంటిది ఇగ్లండ్‌లో ఉండే ప్యాట్రిసియా బేకర్‌ 90 ఏళ్ల వయసులో స్కైడైవింగ్‌ చేసి ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఈ వృద్ధ మహిళకు 10 మంది మనవరాళ్ళు ఉన్నారు. ప్యాట్రిసియా స్కైడైవింగ్‌ తన అనుభవాన్ని వివరిస్తుంది’ ఇది అద్భుతమైనది. మొదటిసారి విమానంలో కూర్చున్నప్పుడు భయపడ్డాను కానీ ఇలా గాలిలో ఎగరడం మాత్రం సరదాగా ఉండేది. అయితే, ల్యాండింగ్‌ తరువాత, పారాచూట్‌ ఆగిపోయినప్పుడు కొంత భయపడ్డాను.

దానికి గతంలో అయిన గాయాలు కూడా ఉన్నాయి. కానీ, ఇన్నాళ్లకు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగినందుకు సంతోషంగా ఉంది. నా భర్త నాలుగేళ్ల క్రితం నాకు దూరమయ్యాడు. అతను ఎప్పుడూ స్కైడైవింగ్‌ ఉత్తేజకరమైనదిగా భావించేవాడు. నా పుట్టినరోజు వేడుక ఈ ఆటతో జరుపుకోవడం ఇష్టపడేవాడు’ అని వివరించింది. ప్యాట్రిసియా కొన్నేళ్ల క్రితం హాట్‌ ఎయిర్‌ బెలూన్, పారాగ్లైడింగ్‌ కూడా చేసింది. కానీ 90వ పుట్టినరోజుకు మొదటిసారి స్కైడైవింగ్‌ చేసింది. బేకర్‌ వ్యక్తిగత వైద్యుడు వయస్సు ప్రకారం ఈ సాహసం చేయవద్దని సలహా ఇచ్చాడు. కానీ బేకర్‌ వినలేదు. డైవ్‌ సెంటర్‌లోనే తన వైద్యపరీక్షలన్నీ చేయించుకొని మరీ ఈ సాహసానికి పూనుకుంది. 

మరిన్ని వార్తలు